Home » జనసేనాని పవన్ కళ్యాణ్‌తో టీవీకే విజయ్‌ని పోల్చడం సబబేనా.?

జనసేనాని పవన్ కళ్యాణ్‌తో టీవీకే విజయ్‌ని పోల్చడం సబబేనా.?

by hellomudra
0 comments
Pawan Kalyan Vizag Varahi Vijaya Hatra

TVK Vijay Janasenani Pawankalyan.. 2019 ఎన్నికల్లో జన సేనాని పవన్ కళ్యాణ్, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అందరికీ తెలిసిన విషయమే ఇది.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్, పోటీ చేసిన రెండు చోట్లా గెలుస్తున్నారు. దాదాపు 100 సీట్లలో టీవీకే పార్టీ విజయం సాధించబోతోంది.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలని, తెలంగాణ రాజకీయాలతోనే పోల్చలేం. అలాంటిది, తమిళనాడు రాజకీయాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్ని పోల్చడం ఎంతవరకు సబబు.?

పవన్ కళ్యాణ్, జన సేన పార్టీని స్థాపించడానికి వెనుక కారణాలు వేరు. విజయ్, టీవీకే పార్టీని స్థాపించిన వ్యవహారం వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జన సేన పార్టీ పోటీ చేసింది.

TVK Vijay Janasenani Pawankalyan.. తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నం..

కానీ, టీవీకే విజయ్‌కి తమిళనాడులో విభజన పంచాయితీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో వున్నట్లు, తమిళనాడులో కుల రాజకీయాల పంచాయితీ లేదు.

తమిళనాడులో జయలలిత మరణం తర్వాత, అన్నాడీఎంకే పార్టీ బలహీన పడింది. అక్కడి డీఎంకే పార్టీకి స్టాలిన్ రూపంలో బలమైన నాయకుడున్నాడు. సో, పొలిటికల్ వాక్యూమ్ వుంది తమిళనాడులో.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితి వేరు. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రెండు చోట్లా ఓడిన పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల నాటికి బలం పుంజుకుని, హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని అందుకున్నారు.

TVK Vijay
TVK Vijay

జనసేనాని తాను గెలవడమే కాదు, ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి గెలుపుకు కారణమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పారు.

విజయ్, సొంతంగా గెలిచాడు కాబట్టి.. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం హాస్యాస్పదం. అసలు ఈ పోలికే అర్థ రహితం.

ముందే చెప్పుకున్నట్లు, తమిళనాడు రాజకీయాలు చాలా చాలా ప్రత్యేకం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో అస్సలు పోల్చలేం.

తమిళనాడులో విజయ్ కంటే ఎక్కువ సినిమా ఫాలోయింగ్ వున్న రజనీకాంత్, కమల్ హాసన్ లాంటోళ్ళే రాజకీయాల్లో నిలబడలేకపోయారు. విజయ్ కాంత్ సంగతి సరే సరి.

ఒక్కటి మాత్రం నిజం.. విజయ్ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.. నిలబడ్డాడు.. సత్తా చాటాడు. కంగ్రాట్స్ విజయ్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group