Home » గెలిచినా తిప్పలే.! టీవీకే విజయ్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఇదీ.!

గెలిచినా తిప్పలే.! టీవీకే విజయ్ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఇదీ.!

by hellomudra
0 comments
TVK Vijay

TVK Vijay Big Blunder.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే, సంచలన విజయాన్ని అందుకున్నారు టీవీకే విజయ్.

రెండు చోట్ల విజయ్ పోటీ చేసి, రెండు చోట్లా గెలిచారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొత్తం 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది.

తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే, అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన ‘118’ అనే నెంబర్‌ని చేరుకోవాల్సి వుండగా, పది సీట్ల తేడాతో.. కాస్త వెనకబడ్డారు విజయ్.

ఫర్లేదు, ఇతర పార్టీల మద్దతు తీసుకుని, ముఖ్యమంత్రి అవ్వొచ్చు. కాంగ్రెస్ పార్టీ సాయం తీసుకున్నారు కూడా. అయినాగానీ, సంఖ్యాబలం సరిపోలేదు.

TVK Vijay Big Blunder.. విజయ్ విఫలమయ్యింది ఇక్కడే..

వామపక్షాలు, ఇతర చిన్నా చితకా పార్టీల మద్దతు కూడా విజయ్‌కి లభిస్తోంది. అయితే, అధికారికంగా ఆ లెక్కల్ని గవర్నర్‌కి చూపడంలో విజయ్ విఫలమవుతున్నారు. అదే అసలు సమస్య.

నిజానికి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, రాజకీయంగా తలపండిన విజ్ఞుల అవసరం ఎంతైనా వుంటుంది. ఆ సాయం విజయ్ తీసుకుని వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు.

వాస్తవానికి, చిన్నా చితకా పార్టీల మద్దతు తీసుకోవడం కంటే, ఏఐఏడీఎంకే లేదా డీఎంకే పార్టీల మద్దతుని విజయ్ కోరి వుండొచ్చు. వీటిల్లో ఏఐఏడీఎంకే పార్టీ, విజయ్‌కి కాస్త బెటర్.

కాంగ్రెస్ కంటే ఏఐఏడీఎంకే బెటర్ కదా..

కాంగ్రెస్ మద్దతు తీసుకున్న విజయ్ ఏఐఏడీఎంకే మద్దతు తీసుకోవడానికి ఎందుకు సంశయించారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

పూర్తి మెజార్టీ లేకుండా.. అంటే, మ్యాజిక్ మార్క్ దాటకుండా, విజయ్ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ముందు ముందు మిత్రపక్షాల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేకపోవచ్చు.

Also Read: క్రైమ్‌ని ఘనకార్యంగా చూపే ప్రయత్నమే.!

తద్వారా ప్రభుత్వం కోల్పోతే, తమిళనాడు ప్రజానీకం నుంచి తీవ్ర వ్యతిరేకతను విజయ్ ఎదుర్కోవాల్సి రావొచ్చు. అదే, విజయ్ రాజకీయ జీవితానికి సమాధాని కట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

తలపండిన రాజకీయ పార్టీలకీ, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకీ మధ్యనున్న తేడా ఇదే. తిట్టిన నోటితోనే, పొగడాలి.. విమర్శించిన పార్టీతోనే సహజీవనం చేయాలి.

రాజకీయ వ్యవస్థలో అవినీతి అంతర్భాగం. ఇదింతే.! ఎప్పటికీ మారదంతే. 108 సీట్లు గెలిచిన విజయ్, ముఖ్యమంత్రి అవ్వాలంటే, 118 సీట్ల బలం చూపించుకోవాలి.

ఆ 10 మంది ఎమ్మెల్యేలు, స్వచ్ఛందంగా మద్దతివ్వరు. ఏదో ఆశిస్తారు.. ఆ పనులు చేసి పెట్టాలి విజయ్. ఆ పనులు అవినీతితో ముడిపడివున్నవే అవుతాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group