Home » ముద్రాభిప్రాయమ్: తడిగుడ్డతో ‘నీట్’గా విద్యార్థుల గొంతు కోసేశారు.!

ముద్రాభిప్రాయమ్: తడిగుడ్డతో ‘నీట్’గా విద్యార్థుల గొంతు కోసేశారు.!

by hellomudra
0 comments
Doctor Cancer Treatment

NEET EXAM Scam.. ఎంత పనైపోయింది.? దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు, ఇంకోసారి ‘నీట్’ పరీక్ష రాయాల్సి వస్తోంది.!

ఔను, ‘నీట్’ పరీక్ష రద్దయ్యింది.. మళ్ళీ ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కారణం, పేపర్ లీక్.! అబ్బే, పేపర్ లీక్ అవలేదు.. అని తొలుత బుకాయించినా, లీక్ కన్ఫామ్ అయిపోయింది.

ఏముందిలే.. మళ్ళీ రాసెయ్యొచ్చు.. అని కొందరు లైట్ తీసుకోవచ్చుగాక. కానీ, ఆ బాధేంటో, పరీక్ష రాసే ‘నీట్’ అభ్యర్థులకే తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా వైద్య విద్య అభ్యసించాలంటే, ‘నీట్’ రాయడం తప్పనిసరి. ‘నీట్’ పరీక్ష కోసం ఏళ్ళ తరబడి సమాయత్తమవుతుంటారు విద్యార్థులు.

కొందరికి ఇంటర్మీడియట్ పూర్తి కాగానే, నీట్ రాసెయ్యగానే ‘క్వాలిఫై’ అయిపోయే అవకాశం దొరుకుతుంది. కానీ, కొంతమంది లాంగ్ టెర్మ్ ఎంచుకుంటారు.

NEET EXAM Scam.. విద్యార్థుల గుండె పగిలింది..

ఏళ్ళ తరబడి కొందరు ‘నీట్’ పరీక్ష కోసం సన్నద్ధమవుతూనే వుంటారు. ఇలాంటివారందరికీ, పరీక్ష రద్దయితే, ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కమాటలో చెప్పాలంటే, గుండె పగిలిపోతుంది.

అలా కొందరికి నిజంగానే గుండె పగిలిపోయింది.. కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు కూడా.! పరీక్ష రద్దయితే, ప్రాణాలు తీసుకుంటారా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.

‘నీట్’ అంటే, సాధారణ పరీక్ష కాదు.. దానికోసం కఠోరమైన సాధన చేయాల్సి వుంటుంది. ఇంతా చేసి, పరీక్ష రద్దయితే.. ఇంకేమన్నా వుందా.?

‘నాన్సెన్స్, ఇకపై నీట్ పరీక్ష రాయకూడదు.. ఏదో ఒకటి.. ముందడుగు అయితే, వేసెయ్యాలి, వైద్య విద్యపై ఆశల్లేవ్.. ఈ దేశంలో, న్యాయం జరగదు’ అనే భావన, కొందరు విద్యార్థుల్లో కనిపిస్తోంది.

ఫీజు వాపస్.. విద్యార్థుల్ని ఉద్ధరించట్లేదు..

గతంలో ‘నీట్’ కోసం చెల్లించిన ఫీజుని వాపస్ చేస్తున్నారట. కానీ, ఇదేమీ ఉద్ధరింపు కాదు. ఎందుకంటే, విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలకు వెల కట్టలేం.

‘కొన్ని మన చేతుల్లో వుండవ్.. లీక్ అనేది, ఘోర తప్పిదమేగానీ.. మేమేం చేయలేం..’ అని నిర్వాహకులు చేతులెత్తేయడం హాస్యాస్పదం.

సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా, ఇంకేం జరిగినా.. భవిష్యత్ ‘నీట్’ ముఖచిత్రమైతే ఒకింత ఆందోళనకరమే.

శిక్ష అత్యంత కఠినంగానే వుండాలి..

కేంద్ర ప్రభుత్వం, అందునా విద్యా శాఖ.. ఈ మొత్తం ఫెయిల్యూర్‌కి బాధ్యత తీసుకోవాల్సి వుంది. దోషులకు కఠిన శిక్ష విధిస్తే తప్ప, ఇలాంటి నేరాలు పునరావృతం కావు.

విద్యాబుద్ధులు నేర్పే ప్రొఫెసర్లు, పేపర్ లీక్ కుట్రలో భాగస్వాములైతే, ఇక ఈ వ్యవస్థ బాగుపడేదెలా.? లక్షల్లో కాదు, కోట్ల రూపాయల ధర పలుకుతోంది మెడిసిన్ సీట్ అంటే, బ్లాక్ మార్కెట్‌లో.

Also Read:

చిన్న తప్పు కాదు, మహా పాపం.. పెద్ద నేరం.. శిక్ష పడాల్సిందే దోషులకి. మరణ శిక్ష విధించినా తక్కువే.

ఎందుకంటే, ‘నీట్’ పరీక్ష రద్దు నేపథ్యంలో, బలవన్మరణానికి పాల్పడ్డ ప్రతి విద్యార్థి గుండె ఘోషకి సమాధానం ఈ సమాజమే చెప్పి తీరాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group