Home » సముద్ర కొబ్బరి ‘కోకో డి మెర్’.! ఇది మీకు తెలుసా.?

సముద్ర కొబ్బరి ‘కోకో డి మెర్’.! ఇది మీకు తెలుసా.?

by hellomudra
0 comments
Coco De Mer

Coco De Mer Seychelles.. ఇది మీకు తెలుసా.? ఇదొక రహస్యమైన ప్రాంతంలో మాత్రమే పెరిగే చెట్టు అని భావించేవారు ఒకప్పుడు. నిజానికి, చాలా చాలా అరుదైన చెట్టు ఇది.

చెట్టు కంటే, చెట్టు నుంచి వచ్చే ‘కాయ’ చాలా ప్రత్యేకమైనది. కొబ్బరి జాతికి చెందినది ఇది. కాకపోతే, స్త్రీ నడుం భాగాన్ని పోలి వుండేలా ఈ కాయ వుంటుంది.

సముద్రంలో కొట్టుకుంటూ సమీపంలోని తీరాలకు చేరుకుంటాయి ఈ ‘కోకో డి మెర్’ కాయలు. దీన్ని సముద్ర కొబ్బరి అని పిలుస్తుంటారు.

రహస్య ప్రాంతంలో కాదు గానీ, చాలా చాలా అరుదుగా మాత్రమే ఈ చెట్లు పెరుగుతాయి. అదీ, సీషెల్స్ దేశంలో మాత్రమే. అక్కడ కూడా, కేవలం రెండు దీవులు ప్రాస్లిన్, క్యూరియస్‌లలో మాత్రమే వుంటాయి.

Coco De Mer Seychelles.. చెట్టు పెరగడానికీ.. కాయ పక్వానికి రావడానికీ..

చెట్టు పెరగడానికి, పక్వానికి రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. దశాబ్దాలని అనుకోవచ్చు. 300 నుంచి 800 సంవత్సరాల వరకు ఈ చెట్లు పెరుగుతాయట.

‘కో కో డిమెర్’ కాయలకు అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం, వాటి రూపమే. ముందే చెప్పుకున్నాం కదా, ‘స్త్రీ నడుం భాగాన్ని’ పోలి వుంటుంది.

Coco De Mer
Coco De Mer

చాలా వల్గర్‌గా ఈ చెట్టు కాయల గురించి కొందరు వీడియోలు చేస్తుంటారు. ఈ ‘కోకో డి మెర్’ మగ చెట్లు ఇంకాస్త భిన్నమైన ఆకర్షణను కలిగి వుంటాయి.

ఈ చెట్లు ప్రపంచంలో ఇంకెక్కడా పెరగవు. ‘కోకో డి మెర్’ కాయల్ని కొనుగోలు చేయాలంటే, వేల డాలర్లు వెచ్చించాల్సిందే. పేటెంట్ తరహాలో, ప్రత్యేకమైన అనుమతులు పొందాలి, వీటిని కొనుగోలు చేయడానికి.

Coco De Mer
Coco De Mer

కాయలు, పక్వానికి రావడానికి కూడా ఆరు నుంచి ఏడేళ్ళు పడుతుందంటే, వీటి ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సీషెల్స్ దేశానికి ఎవరు వెళ్లినా, వీటిని చూసి వస్తుంటారు.

సముద్ర గర్భంలోని ఓ అజ్ఞాత ప్రాంతంలో ‘సముద్ర కొబ్బరి’ ఉద్భవిస్తుందనే అపోహలు ఒకప్పుడు వుండేవి. ఆ అపోహల సంగతెలా వున్నా, ఇది నిజంగానే ఓ అద్భుతం.

ప్రకృతిలో చాలా అద్భుతాలున్నాయ్.. వాటిల్లో ప్రతీదీ ప్రత్యేకమే. దేనికదే, స్పెషల్‌గా డిజైన్ చేసినట్లుంటుంది. అందులో ఈ ‘కోకో డిమెర్’ ఇంకాస్త ప్రత్యేకం.

Coco De Mer
Coco De Mer

సీషెల్స్ వెళితే, ఈ ‘కోకో డి మెర్’తో ఫొటోలు దిగడం మర్చిపోవద్దు సుమీ.!

సీషెల్స్.. సీచెల్లెస్.. ఎలా పలికినా, ఇది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన దేశంగా చెబుతారు.. పర్యాటక రంగం కోణంలో.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెద్దయెత్తున పర్యాటకులు ఈ దేశంలోని 100కి పైగా దీవుల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group