Home » రంగుల కల చెదిరింది.! ఓ వెలుగు వెలిగి, చీకట్లో కలిసిపోయింది.!

రంగుల కల చెదిరింది.! ఓ వెలుగు వెలిగి, చీకట్లో కలిసిపోయింది.!

by hellomudra
0 comments
Pavala Shyamala

Pavala Shyamala Telugu Cinema.. సినిమా కష్టాలు అంటాం కదా.! అలాంటిదే ఆమె కష్టం కూడా.! సినీ రంగంలో నటిగా ఎత్తుపల్లాల్ని చూసింది. ఎన్నో కష్టాల్ని అనుభవించింది.. నటిగా పేరు తెచ్చుకుంది.

పగవాడిక్కూడా రాకూడదు ఈ కష్టం.. అనిపించేలా, ఆమె చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది.

అంతా ‘అయ్యోపాపం’ అన్నవారే.! కొందరు ఆదుకున్నారు కూడా.! కానీ, ఆమె కష్టాలు తీరలేదు. ఎలాగైతేనేం, ఆమె జీవితానికి ప్రశాంతత లభించింది. మరణం కంటే, ప్రశాంతత ఏముంటుంది.?

ఇంతకీ ఎవరామె.? అసలు పేరేమో నేతి శ్యామల. స్క్రీన్ నేమ్ పావలా శ్యామల. ‘పావలా’ అనే నాటకం ద్వారా ఆమె పేరు ముందర ఆ పేరు చేరింది.

Pavala Shyamala Telugu Cinema.. ఖరీదైన ఆసుపత్రిలో.. నడి రోడ్డుపై..

పావలా శ్యామల వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం కారణంగా మంచాన పడ్డారు. పలువురు సినీ ప్రముఖులు ఆర్థికంగా ఆమెకు అండదండలు అందించారు.

కానీ, ఆ ఆర్థిక అండదండలు పావలా శ్యామలను ఆర్థికంగా కష్టాల నుంచి గట్టెక్కించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందామె.

‘నడి రోడ్డుపై అనాధలా పావలా శ్యామల..’ అంటూ, మీడియాలో బోల్డన్నిసార్లు కథనాలు వచ్చాయి. ‘ఆటో డ్రైవర్ నిర్దయగా పావలా శ్యామలని రోడ్డుపై వదిలేసిపోయాడు’.. అనే వార్తలు చాలానే చూశాం.

ఆ తర్వాత సినీ ప్రముఖులు స్పందించి, ఆమెను ఆసుపత్రిలో చేర్చించేవారు. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులు భరిస్తామనీ చెప్పేవారు, భరించేవారు కూడా.

మళ్ళీ కథ మొదటికి వచ్చేది. ఆసుపత్రి నుంచి ఆమెను ఎవరు బయటకు పంపేసేవారో తెలియదు.. కానీ, మళ్ళీ ఆమె రోడ్డు మీదనే ప్రత్యక్షమయ్యేది అచేతనావస్థలో.

ఎలాగైతేనేం, ఆమెకు ప్రశాంతత లభించింది. ఔను, ఆమె ఇప్పుడు జీవించి లేదు. చాలామంది నటీనటులు జీవితం చివరి దశలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు.

ఆ లిస్టులోనే పావలా శ్యామల పేరు కూడా చేరిపోయింది.! సినీ పరిశ్రమ పెద్దలు, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకుండా నటీనటుల సంక్షేమం కోసం ఓ నిధిని ఏర్పాటు చేస్తే బావుంటుందేమో.

ప్రభుత్వాలు పేదలకు అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంటాయి. సినీ కళాకారులకూ ప్రత్యేకంగా ఏమైనా సంక్షేమ పథకాల్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అమలు చేస్తే బావుంటుంది కదా.!

సినీ కళాకారులుగా కాదు.. వాళ్ళని సాధారణ మనుషుల్లా గుర్తించి అయినా, ప్రభుత్వాలు ఆదుకోవాల్సి వుంటుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group