Sonam Bajwa Hand Bag.. హ్యాండ్ బ్యాగ్ కూడా ఫ్యాషన్ ట్రెండే.. అని కొత్తగా చెప్పాలా.? అమ్మాయి, అందం.!
ఔను, మహిళలు.. మహరాణులు.! మహరాణుల్లా కనిపించాలంటే, ఆ బ్యాగ్‌కి కూడా ఆ రేంజ్ వుండాలి మరి.!
మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ హ్యాండ్ బ్యాగ్స్ వస్తూనే వుంటాయి. బ్రాండ్స్‌ని బట్టి, ధర వేలల్లో కాదు, లక్షల్లోకి మారిపోతుంటుంది.
వజ్రాలు పొదిగితే, కోట్ల రూాపాయల ఖరీదు అయిపోతుంది ఆ హ్యాండ్ బ్యాగ్. అయినాసరే, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే, ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదేమో.!

పొటోలో చూస్తున్నారు కదా.. హ్యాండ్ బ్యాగుతో ఎలా పోజులిచ్చేస్తోందో. ఈ బ్యూటీ పేరు సోనమ్ బజ్వా. బాలీవుడ్ నటి.! పలు వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితురాలే.
ఇప్పుడంతా ఓటీటీ యుగం కదా.. అన్ని భాషల్లోకీ సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ చాలా తేలిగ్గానే డబ్ అయిపోతున్నాయ్.
తాజాగా, సోనమ్ బజ్వా ఇలా ఫొటో షూట్‌తో హల్‌చల్ చేసింది.! ఏ మాటకామాటే చెప్పాలంటే, సోనమ్ బజ్వా బ్యాగు భలే ఎట్రాక్ట్ చేసేస్తోంది.. చెయ్యాలనే కదా.. ఇదంతా.!
ఇంతకీ, ఆ బ్యాగు ప్రత్యేకత ఏంటి.? ప్రత్యేకతల సంగతి పక్కన పెడితే, ఇంత అందగత్తె ప్రమోట్ చేస్తోంది కదా.. అదే, ఆ ప్రత్యేకత అనుకోవాలేమో.

మరీ, అంత ఇన్నోవేటివ్‌గా ఆ హ్యాండ్ బ్యాగ్ ఏమీ లేదు.. అని కొందరు అనుకోవచ్చు గాక.. అందులో నిజం కూడా వుండి వుండొచ్చుగాక.!
చక్కనమ్మ ఏం చేసినా అందమే.! అలాగని సరిపెట్టుకోవాల్సిందే కూడా.! రకరకాల రంగులు.. రకరకాల డిజైన్లు.. ఇలా హ్యాండ్ బ్యాగులు వివిధ బ్రాండ్లతో మహిళల్ని ఆకర్షిస్తుంటాయ్.
అంతలా, ఆ హ్యాండ్ బ్యాగుల్ని బోల్డంత రేటు పెట్టి కొనేసి, వాటిని ఎలా వినియోగిస్తారు.? అంటే, స్టైలిష్ లుక్ కోసమే.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు కదా.!
