Pawan Chiranjeevi Mega Bonding.. చిరంజీవి హీరోయిజం గురించి కొత్తగా చెప్పేదేముంది.? తెలుగు తెరపై తిరుగులేని స్టార్డమ్ మెగాస్టార్ చిరంజీవి సొంతం.!
కానీ, చిరంజీవి హీరోయిజం.. చిరంజీవి సినిమాల్లోకి రాకముందే చూస్తే.! అలా ఆ హీరోయిజాన్ని చూసింది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే.!
అంతే కదా, ఏ తమ్ముడికైనా.. తన అన్నయ్య హీరోయిజం ఓ రేంజ్లో కనిపిస్తుంది.!
కాకపోతే, అన్నయ్య అంటే తండ్రి సమానుడు.. అన్నంత ప్రేమ, తమ్ముడికి కలిగేలా, తమ్ముళ్ళను చూసుకున్నారు చిరంజీవి. సో, ఇదీ అసలు సిసలు హీరోయిజం.. అన్నమాట.
మరి, తనయుడి లాంటి తమ్ముడుంటే.. ఎవరు మాత్రం ఇన్స్పైర్ అవరు.? అవుతారు, అయ్యారు కాబట్టే.. ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవితో చిన్నప్పటినుంచీ తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు.
అన్నయ్య కాలేజీకి వెళ్ళినప్పుడు, వేసవి సెలవులకు మాత్రమే ఇంటికి వచ్చినప్పుడు.. అన్నయ్య మీద చూపించిన అభిమానం. ఇలా చాలా విషయాల్ని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కుటుబం కోసం అన్నయ్య త్యాగాలు, సినీ రంగంలో అన్నయ్య పడ్డ కష్టం.. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
ఇంతకు ముందూ పవన్ కళ్యాణ్, తన అన్నయ్యకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేశారుగానీ.. ఈసారి చాలా చాలా ప్రత్యేకం.
మరోపక్క, తమ్ముడి ఎమోషనల్ ట్వీట్‌పై అన్నయ్య చిరంజీవి కూడా అంతే ఎమోషనల్‌గా స్పందించారు. ప్రజా సేవలో బాధ్యతగా పని చేస్తున్న తమ్ముడిని చూసి ఇన్స్పైర్ అయినట్లు పేర్కొన్నారాయన.
