Home » రష్మిక మండన్న ‘తెలంగాణ యాస’లో మాట్లాడితే తప్పేంటి.?

రష్మిక మండన్న ‘తెలంగాణ యాస’లో మాట్లాడితే తప్పేంటి.?

by hellomudra
0 comments
Rashmika Mandanna

Rashmika Mandanna Telangana Slang.. రష్మిక మండన్న తెలుగమ్మాయ్ కాదు.. కానీ, తెలుగింటి కోడలు.! ఇంకా కరెక్టుగా చెప్పాలంటే, తెలంగాణ ఇంటి కోడలు రష్మిక మండన్న.

ఈ కన్నడ కస్తూరి, తెలుగు నేర్చుకుని.. తెలుగులో గలగలా మాట్లాడటమే కాదు, తెలుగు సినిమల్లో తన పాత్రకి తానే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది.

తెలంగాణకి చెందిన విజయ్ దేవరకొండని పెళ్ళాడాక, తెలంగాణ ఇంటి కోడలయ్యింది రష్మిక మండన్న.

తన మరిది ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రీసెంట్‌గా తమన్నా మాట్లాడిన మాటలపై కొందరు ఆక్షేపణ మొదలెట్టారు.

తెలుగు వేరు.. తెలంగాణ వేరు.. అంటూ, ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. తెలుగు అనేది భాష.. తెలుగు రాష్ట్రాల్లో బోల్డన్ని యాసలున్నాయి.

ఉత్తరాంధ్ర యాస వేరు, రాయలసీమ మాండలికం వేరు. తెలంగాణలో మాట వేరు. అయినాసరే, అన్ని చోట్లా మనం మాట్లాడేది తెలుగు భాషనే.

తమిళనాడు బోర్డర్‌లో తెలుగువారు, తమిళాన్ని మిక్స్ చేసి, ఓ రకమైన తెలుగు యాసలో మాట్లాడతారు. శ్రీకాకుళం బోర్డర్‌లో ఒరియా మిక్స్ అవుతుంది.

అనంతపూర్ వైపు కన్నడ మిక్స్ అవుతుంది. తెలంగాణ సరిహద్దుల్లో మరాఠా, కన్నడ కలుస్తుంది. స్థానికంగా కూడా కొన్ని తెగలు మాట్లాడే భాష.. అది మళ్ళీ వేరే చర్చ.

సోషల్ మీడియాలో కాదేదీ వివాదానికి అనర్హం.. అని తెలుసు కదా.! ‘ఎపిక్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో రష్మిక, తెలంగాణ మాండలికంలో మాట్లాడిందంటూ వివాదం మొదలు పెట్టారు.

ప్రాంతంతో సంబంధం లేకుండా, యంగ్ జనరేషన్ ఇలా రకరకాల యాసల్ని మిక్స్ చేసి మాట్లాడటం సర్వసాధారణం. నటీనటుల సంగతి సరే సరి. అది యువతని ఉత్సాహపరచడానికి మాత్రమే.

అయినాసరే, తెలంగాణ కోడలు.. తెలంగాణ యాసలో మాట్లాడితే తప్పేంటి.? తెలుగు నేర్చుకుని, తెలుగులో రకరకాల యాసలు మాట్లాడుతోందని మనమంతా గర్వపడాలి కదా ఆమెని చూసి.!

‘ఎపిక్’ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘ఫిదా’ సినిమా కోసం తెలంగాణ స్లాంగ్ నేర్చుకున్న సాయి పల్లవి కూడా తెలుగమ్మాయ్ కాదు. సాయి పల్లవి ఎక్కడన్నా మాట్లాడితే, ఆమె మాటలో తెలంగాణ స్లాంగ్ స్పష్టంగా కనిపిస్తుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group