Home » ఊహించని ప్రెగ్నెన్సీ.! సమంత ఇలా ఎందుకు చెప్పిందబ్బా.!?

ఊహించని ప్రెగ్నెన్సీ.! సమంత ఇలా ఎందుకు చెప్పిందబ్బా.!?

by Mudra369 Editorial Desk
0 comments
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu Pregnancy.. సినీ నటి సమంత, ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరు కొన్నాళ్ళ క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్ళయ్యాక రాజ్ నిడిమోరు నిర్మాణంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది కూడా.!

ఇంగేజ్మెంట్ సమయంలో సమంతకి అత్యంత ఖరీదైన బహుమతినిచ్చాడు రాజ్ నిడిమోరు. ఏకంగా కోటిన్నర విలువైన స్పెషల్లీ డిజైన్డ్ వజ్రపుటుంగరాన్ని తొడిగాడు.

ప్రస్తుతం సమంత – రాజ్ నిడిమోరు తమ ‘వారసత్వం’ కోసం ఎదురుచూస్తున్నారు. సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఓ దశలో నేను, రాజ్.. పిల్లల్ని కనాలన్నదానిపై అసలు ఎలాంటి ఆలోచనలూ చేయలేదని, ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని సమంత చెప్పింది.

Samantha Ruth Prabhu Pregnancy.. సినిమా షూటింగ్ సమయంలో…

‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ సమయంలో పాట చిత్రీకరణ సందర్భంగా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందనీ, నీరసంగా వుండడంతో వైద్యులు పరీక్షించి, తన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేశారని సమంత వెల్లడించింది.

అయినా, పెళ్ళయ్యాక పిల్లల విషయమై సమంత – రాజ్ నిడిమోరు ఎందుకు ‘పిల్లలు కలిగినా ఓకే.. కలగకపోయినా ఓకే..’ అనుకున్నట్లు.?

నిజానికి, ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. సమంత అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడింది గతంలో. బహుశా, ఆ సమస్య కారణంగా పిల్లలు కలగరేమోనన్న భయం సమంతలో వుండి వుంటుందేమో.

Also Read: దీపిక రెమ్యునరేషన్ గోల: హీరోల మీద ఏడుపెందుకో.!?

భర్తగా రాజ్ నిడిమోరు, తన భార్య సమంతకి పూర్తి స్థాయిలో అండగా నిలిచాడనే విషయం సమంత వ్యాఖ్యలతో అర్థమవుతోంది.

మాతృత్వం మధురానుభూతి.! ఏ మహిళ అయినా సరే, ‘అమ్మా’ అనిపించుకోవాలని తహతహలాడుతుంది. సమంత కూడా అంతే.!

తమ తొలి బిడ్డ కోసం సమంత – రాజ్ నిడిమోరు దంపతులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘అమ్మాయైనా ఫర్లేదు.. అబ్బాయైనా ఫర్లేదు..’ అంటోంది సమంత.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group