Rhea Chakraborty Disha Salian.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ గుర్తున్నాడా.? అదే, ‘తూనీగ తూనీగ’ ఫేం నటి రియా చక్రవర్తికి అత్యంత సన్నిహితుడు.!
స్టార్డమ్ వస్తున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా, నిజానికిదొక మిస్టరీ.
మరోపక్క, సుశాంత్ సింగ్ రాజ్పుట్ మేనేజర్ దిశా శాలియన్ కూడా అనుమానాస్పద స్థిలో మృతి చెందింది. ఆమె ఆత్మ హత్య చేసుుందని కేసు కొట్టేసే ప్రయత్నాలు జరిగాయి.
కానీ, దిశా శాలియన్పై సామూహిక అత్యాచారం జరిగిందనీ, ఆమెను అతి కిరాతకంగా చంపేశారనీ ఆరోపణలున్నాయి. తాజాగా, ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది.
సంచలనం ఏంటంటే, దిశా శాలియన్ హత్యాచారం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే కుమారుడు ఆధిత్య ధాక్రే పేరుని నిందితుల లిస్టులో సీబీఐ చేర్చడం.
Rhea Chakraborty Disha Salian.. డెత్ మిస్టరీ.. లెక్కలు తేలతాయా.?
బాలీవుడ్ నటుడు డినో మోరియా, అలానే నటి రియా చక్రవర్తి పేర్లు కూడా నిందితుల లిస్టులోకి ఎక్కడంతో, ఈ కేసు విచారణ కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.
సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనుమానాస్పద స్థితిలో మరణించడం, అతని మేనేజర్ దిశా శాలియన్ హత్యకు గురైందని తేలడం.. వెరసి, ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమవుతోంది.

నటుడు సుశాంత్ డెత్ మిస్టరీకి సంబంధించి రియా చక్రవర్తిపైనా చాలా ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులోనూ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది.
అయితే, తాను మంచి స్నేహితుడిని కోల్పోయిన బాధలో వున్నాననీ, ఆ స్నేహితుడు సుశాంత్ డెత మిస్టరీ కేసులో తనను నిందితురాలిగా చూడటం తగదనీ రియా వాదిస్తూ వస్తోంది.
సినీ పరిశ్రమలో చాలా డెత్ మిస్టరీలు ఎప్పటికీ ఓ కొలిక్కి రావు. నటి దివ్య భారతి డెత్ మిస్టరీ గురించి తెలుసు కదా.? నటి జియా ఖాన్ డెత్ మిస్టరీ కూడా ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు.
