Mamitha Baiju Hyper Active.. టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత వున్న సంగతి తెలిసిందే. అందుకే పొరుగింటి పుల్లకూరకు రుచెక్కువ అని.. ప్రతీసారీ పర భాషా ముద్దుగుమ్మల్ని ఎరువు తెచ్చుకుంటుంటాం.
అలాగని తెలుగులో హీరోయిన్లు లేరా.? అని కాదు.. చెప్పుకున్నాం కదా.! పొరుగింటి పుల్లకూరకు రుచెక్కువ మరి.
ముఖ్యంగా మలయాళీ ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువ. అలా టాలీవుడ్‌లో సక్సెస్ అయిన కేరళ కుట్టీల లిస్టు తీస్తే.. అబ్బో.! చాలా పెద్ద లిస్టే అవుతుందనుకోండి.
తాజాగా ఓ మలయాళ కుట్టీ పేరు గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు మిమిత బైజు. అప్పుడెప్పుడో ‘ప్రేమలు’ సినిమా టైమ్ నుంచీ ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్‌లో బాగా వినిపిస్తూ వస్తోంది.
తెలుగు వెర్షన్ ‘ప్రేమలు’ సినిమాకి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మమితా బైజు నటించిన‘డ్యూడ్’ తదితర తమిళ సినిమాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయ్.
Mamitha Baiju Hyper Active.. పట్టించుకోవడం లేదెందుకో చెప్మా.!
రీసెంట్‌గా సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమాలో మమితా బైజు నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా హిట్టు.. మమితా బబ్లీ పర్‌ఫామెన్స్ సూపర్ హిట్టు.
అంతా బాానే వుంది. కానీ, ఆడియన్స్ అయితే, కనెక్ట్ అవుతున్నారు ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’తో ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్ చేసేసింది.
కానీ, మన మేకర్స్ ఎందుకో మమితా బైజును పట్టించుకోవడం లేదు. అందం వుంది. ఎలాంటి పాత్రయినా హ్యాండిల్ చేయగల టాలెంట్ వుంది. గ్లామర్‌లోనూ నో లిమిట్స్.!
మరి, ఎందుకని మేకర్స్‌ని ఎట్రాక్ట్ చేయలేకపోతోందో ఈ కేరళ కుట్టి. ఇంతవరకూ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు మమితా బైజు.
ప్రస్తుతం ఆమె చేతిలో వున్న ప్రాజెక్టుల్లోనూ తెలుగు సినిమాల ఊసేం లేదు. ఒక్క హిట్టొస్తేనే ఆ హీరోయిన్ వైపు ఆటోమెటిగ్గా దృష్టి వెళ్లిపోతుంది.
అలాంటిది మమితా బైజు డైరీలో ఇన్ని హిట్స్ వున్నప్పటికీ టాలీవుడ్ ఆమెను బొత్తిగా పట్టించుకోకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నే మరి.!
సాధారణంగా హీరోయిన్లు తెరపై మరీ హైపర్ యాక్టివ్‌గా కనిపిస్తే, అస్సలు బాగోదు. కానీ, మమిత బైజు విషయంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.
చాలా క్యూట్‌గా కనిపిస్తుంటుంది. కారణం, అన్ని ఎమోషన్స్ ఆమె మొహంలో పండటమే కావొచ్చు. అందుకే, మమిత బైజుకి బోల్డంత ఫాలోయింగ్.. అదీ, అతి తక్కువ సమయంలోనే వచ్చేసింది.
