Home » జనసేనాని పవన్ కళ్యాణ్ ‘పవర్ గేమ్’ షురూ.!

జనసేనాని పవన్ కళ్యాణ్ ‘పవర్ గేమ్’ షురూ.!

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Power Game.. ఎవరైనా రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు.? అధికార పీఠమెక్కడమే లక్ష్యంగా కదా ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించేది.?

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే.! కాకపోతే, పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు. రాజకీయమంటే ప్రజా సేవ.. అని బలంగా నమ్ముతారాయన.

అధికార పీఠమెక్కడానికి అడ్డదారులు తొక్కడం పవన్ కళ్యాణ్‌కి తెలియదు. తెలిసినా, ఆ అడ్డదారిలో ఆయన వెళ్లరుగాక వెళ్ళరు.!

2014 ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఆ ఎన్నికల్లో అసలు పోటీనే చెయ్యలేదు.

పోటీ చెయ్యకపోయినా, రాజ్యసభకు ఆయన్ని పంపించేందుకు బీజేపీ ప్రయత్నించింది. పవన్ కళ్యాణ్, కేవలం మద్దతిచ్చి ఊరుకున్నారు బీజేపీ – టీడీపీ కూటమికి అప్పట్లో.

ఇక, 2019 ఎన్నికల్లో జన సేనాని పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఒకే ఒక్క సీటుని జన సేన పార్టీ గెలుచుకుంది. ఆ సీటునీ, ఆ తర్వాత వైసీపీ లాగేసుకుంది.

Pawan Kalyan Power Game.. చాలా మారింది.. చాలా చాలా మారింది.!

అయితే, 2024 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీతో జత కట్టిన జన సేనాని, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా జన సేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలిచారు.

ఇప్పుడు జన సేన పార్టీకి రాజ్యసభ సభ్యుడు, అలానే ఎమ్మెల్సీలు కూడా వున్నారు. 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. కానీ, ఈలోగా స్థానిక ఎన్నికల కోసం తనదైన వ్యూహాలు రచిస్తున్నారు జన సేనాని.

ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి జన సేన పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్న నాయకుల నుంచి, ‘ట్రాక్ రికార్డ్’ ఆధారంగా కొందర్ని ఎంపిక చేసి, వారికి జన సేన కండువా కప్పుతున్నారు పవన్ కళ్యాణ్.

రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. కాకపోతే, జన సేనాని వ్యూహం వేరు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పటిష్టం దిశగా ఈ చర్యలు చేపడుతున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల స్థాయి నాయకుల్ని తీసుకుంటూ, ఇంకోపక్క నిఖార్సయిన జన సైనికుల నుంచీ నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు జన సేనాని.

ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినా..

ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే, ఈసారి నేరుగా అధికార పీఠమే లక్ష్యంగా జన సేనాని వ్యూహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ – బీజేపీతో కలిసి మరో రెండు సార్లు పోటీ చేయాలనే అభిప్రాయాన్ని జన సేనాని వ్యక్తం చేస్తున్నప్పటికీ, భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలాగైనా మారొచ్చని ఆయనకీ తెలుసు.

స్థానిక ఎన్నికల్ని ఓ శాంపిల్ టెస్ట్ కింద భావిస్తున్న జన సేనాని, 2029 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్ని ఇప్పటినుంచే సమాయత్తం చేస్తున్నారు.

బలం పుంజుకోగలిగితే, ఒకవేళ మళ్ళీ కూటమిగానే కలిసి పోటీ చేయాల్సి వచ్చినా, ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు వీలుగా జన సేనాని ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారన్నది సుస్పష్టం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group