Table of Contents
Producer Nagavamsi Gets Trolled Again.. యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘సితార’ బ్యానర్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
చిన్న వయసులోనే పెద్ద నిర్మాతగా మారిన నాగవంశీ అంటే, గుర్తింపు.. గౌరవం.. ఇవి లేవు సరికదా, ‘నిర్మాత నాగవంశీ’ అనే పేరు ఓ ట్రోల్ అయిటెమ్ అయిపోయింది.
‘చింప్టూ’ అంటూ నాగవంశీని నెటిజనం ట్రోల్ చేస్తుంటారు. దానిక్కారణం అందరికీ తెలిసిన విషయమే. చాలా ‘తేలిగ్గా’ మాట్లాడేస్తుంటాడు నాగవంశీ. సెటైర్లేస్తాడు, ఓవరాక్షన్‌లా వుంటుందతని ప్రవర్తన.
ఇప్పుడు ఇంకోసారి నాగవంశీ తాజాగా ట్రోల్ అవుతున్నాడెందుకో తెలుసా.? ‘ఆదర్శ కుటుంబం’ సినిమా గురించి. ‘ప్లానింగూ లేదు.. పాడూ లేదు..’ అంటూ నాగవంశీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజనం.
ప్రీ రిలీజ్ హైప్ బావున్నాగానీ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తెరకెక్కింది. త్రివిక్రమ్ సినిమా.. పైగా, వెంకీతో సినిమా.. సహజంగానే సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ గట్టిగానే క్రియేట్ అయ్యింది.
కానీ, ఏం లాభం.? సినిమా రిలీజ్ విషయమై గందరగోళం కొనసాగుతూనే వుంది. సినిమా విడుదల ఈ నెలాఖరుకి వాయిదా పడిందట.. అన్న గాసిప్, నాగవంశీ ట్రోల్ అవడానికి కారణమైంది.
నిర్మాత ప్లానింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు చాలా అంశాలు సినిమా రిలీజ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందులో, ఓటీటీ సంస్థల గొంతెమ్మ కోర్కెలు అత్యంత కీలకమైనవి.
ఇంకోపక్క, వివిధ కారణాలతో షూటింగ్ ఆలస్యమవడం, రీషూట్ల తతంగం.. ఇదంతా మళ్ళీ వేరే చర్చ. పోస్ట్ ప్రొడక్షన్ తలనొప్పుల సంగతి సరే సరి.
అన్నీ నిర్మాత చేతుల్లో వుండవ్..
నిజమే, నిర్మాతకి ప్లానింగ్ వుండాలి. ఎంత ప్లానింగ్‌తో వున్నా, అన్నీ మన చేతుల్లో వుండవ్.. అన్నది చాలామంది నిర్మాతలు చెప్పే మాటే.! ఇది నాగవంశీకి కూడా వర్తిస్తుంది.
ఆ మాటకొస్తే, నాగవంశీ మాత్రమే కాదు, నిర్మాత దిల్ రాజు కూడా ట్రోల్ అవుతుంటాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంగతి సరే సరి.!
నడుస్తున్నది ట్రోల్ ట్రెండ్.! కాదేదీ, ట్రోలింగ్‌కి అనర్హం.! ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కూడా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఆలస్యంపై ట్రోలింగ్ జరుగుతోంది లెండి.!
చెక్కుడు ఆలస్యమైతే..
చెక్కుడు ఆలస్యమవడమే కాదు, చివరి నిమిషంలో మార్పులు చేర్పుల వల్ల సినిమా ఆలస్యమవుతోందన్నది త్రివిక్రమ్ మీద, సినీ వర్గాల్లో నడుస్తున్న గాసిప్.
‘మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ వుండొచ్చు.. కానీ, ఈసారి అలాంటి డౌట్స్ ఏం వద్దు..’ అంటూ, అక్టోబర్ 1న నాగవంశీ ట్వీటేశాడు ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ విషయమై.
అక్టోబర్ 6వ తేదీన ట్రైలర్ రిలీజ్, ఏడవ తేదీన టిక్కెట్స్ బుకింగ్ ప్రారంభం, తొమ్మిదో తేదీన సినిమా రిలీజ్.. అంటూ షెడ్యూల్ కూడా ఇచ్చేశాడు నాగవంశీ. అందుకే, ఇప్పుడింతలా ట్రోలింగ్ జరుగుతోంది.
