Neha Boraa AISA Gyanesh Kumar.. ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు మిన్నంటుతున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్యానేశ్వర్ రాజీనామా కోరుతూ నిరసనలు హోరెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి సంకటంగా మారుతున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, ఆందోళనకారులు చేస్తున్న చిత్ర విచిత్రమైన ఆందోళనలు పోలీసు శాఖకు తలనొప్పిగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసులకు కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నారు.
అందునా, మహిళా విద్యార్థినులు పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసులు తమను అసభ్యకరంగా తాకుతున్నారని మహిళా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
అయితే, మహిళా ఆందోళనకారుల విషయంలో కేవలం మహిళా పోలీసుల్ని మాత్రమే వినియోగిస్తున్నామన్నది పోలీసు శాఖ వాదన.
ఆందోళనకారులే, మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
Neha Boraa AISA Gyanesh Kumar.. ఆందోళనకారులూ.. పోలీసులూ.. ఇద్దరూ మహిళలే కదా..
అరెస్టయిన ఆందోళనకారుల్ని, పోలీసు వాహనాల్లో తరలిస్తున్నప్పుడు, ఆ వాహనాల్ని ధ్వంసం చేసి, ఆందోళనకారులు తప్పించుకుంటున్న వైనం.. మరింత ఆశ్చర్యకరంగా వుంటోంది.
విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా, ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. బారికేడ్లు ఎక్కి, తోటి ఆందోళనకారుల్ని పోలీసుల వైపు ఆమె ఉసిగొల్పిన తీరు.. అభ్యంతకరం.
అదే సమయంలో, మీడియా ప్రతినిథులు నేహా బోరా వీడియోల్ని ప్రత్యేకంగా తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. తోపులాటల్లో దుస్తులు చెదిరిపోవడం, మహిళా ఆందోళనకారులకు ఇబ్బందికరమే.
అయితే, ఏమాత్రం ఇంగితం లేకుండా, నేహా బోరాని అభ్యంతకరంగా చిత్రీకరిస్తున్నాయి మీడియా కెమెరాలు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ నేహా బోరా ఇస్తోందన్న విమర్శలూ లేకపోలేదు.
వెర్రితలలు వేస్తున్న ఆందోళనలు..
నిరసనలు, ఆందోళనల్లో.. ఇదో కొత్త అధ్యాయం.. అనుకోవాలేమో.! మీడియా ముసుగులో యూ ట్యూబ్ ఛానెళ్ళు, ‘రీచ్’ కోసం ఆందోళనకారుల్నే కాదు, పోలీసుల్నీ అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు.
రాజకీయ పార్టీలు కావొచ్చు, విద్యార్థి సంఘాలు కావొచ్చు.. ఈ తరహా వీడియోల విషయమై అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.
‘నాయకత్వానికి’ అర్థం మారిపోయింది. పాత్రికేయ వ్యభిచారం సంగతి సరే సరి.! ఆందోళనలూ అత్యంత అసభ్యకరంగా మారిపోతున్నాయి.
విదేశీ శక్తులు తెరవెనుక అందిస్తున్న ఆర్థిక అండదండలతో.. దేశంలోని అసాంఘీక శక్తులు పెచ్చిమీరిపోతుండడం దురదృష్టకరం.