Ys Jagan Sajjala Backstabbing.. విజయనగరం జిల్లాకి చెందిన ఓ కీలక నేత వైసీపీని వీడారు. మరో కీలక నేతని వైసీపీ నుంచి సస్పెండ్ చేసేశారు.!
ఇంతకీ, వైసీపీ అధినేత వైఎస జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేస్తారట.? అయినా, ఇదేం ప్రశ్న.?
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా ఎలాగైనా జరగొచ్చు.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అంటాం కదా, అలానే.! వైసీపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసేంత సీన్ ఎవరికి వుంటుంది.?
వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మని తొలగించగా లేనిది.. వైసీపీలో నెంబర్ టూ అయిన (అప్పట్లో) వైఎస్ షర్మిలని, వైసీపీ నుంచి బయటకు పంపించేయగా లేనిది.. వైఎస్ జగన్‌ని మాత్రం ఎందుకు తీసెయ్యలేరు.?
ఆ స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికే వుందన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.! నిజంగానే ఆ చర్చ జరుగుతోందా.? నిప్పు లేకుండానే పొగ వస్తుందా.?
ముందే చెప్పుకున్నాం కదా, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. వైసీపీ నుంచి ఒకరొకరుగా నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది కూడా రాజకీయాల్లో సర్వసాధారణమే.
Ys Jagan Sajjala Backstabbing.. డ్యామేజ్ కంట్రోల్.. ట్రబుల్ షూటింగ్..
కాకపోతే, వైసీపీ పుంజుకునేదెలా.? డ్యామేజ్ కంట్రోల్ చర్యలెందుకు చేపట్టడం లేదు.? అసలంటూ పార్టీలో ట్రబుల్ షూటర్ లేకపోతే ఎలా.?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంటే, అది పూర్తిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇది జగమెరిగిన సత్యం.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక, బెంగళూరుకి వెళ్ళిపోయారు వైఎస్ జగన్. అక్కడే వుంటున్నారాయన. అప్పుడప్పుడూ, వీకెండ్ విహారానికి మాత్రమే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు.
సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలకైతే మరీ చుట్టపు చూపు వ్యవహారమే. ఎందుకిలా.? పార్టీని ఎందుకు వైఎస్ జగన్ నిర్లక్ష్యం చేస్తున్నట్లు.?
జనసేన పార్టీని చూసి..
జన సేన పార్టీని చూసి, వైసీపీ క్రియాశీలకంగా పని చేసే కార్యకర్తలకు (వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ వుండి తీరాలి) ఇన్స్యూరెన్స్ సౌకర్యాల్ని కల్పిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కానీ, ఈ నిర్ణయం అమలు కంటే ముందే బెడిసికొడుతోంది. కార్యకర్తలందరికీ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలిగానీ.. కొందరికే.. అంటే ఎలా.? అన్నది అంతటా వినిపిస్తున్న ప్రశ్న.
జన సేన పార్టీ విషయంలో అలా కాదు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే చాలు, ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. దాదాపుగా టీడీపీలో కూడా ఈ పద్ధతి వుందనుకోండి.. అది వేరే సంగతి.
వైసీపీ ఇన్స్యూరెన్స్ వ్యవహారంలో, సజ్జల అతి తెలివి వైఎస్ జగన్ కొంప ముంచుతోందన్నది సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన.
ఇదే పద్ధతి కొనసాగితే, వైసీపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సజ్జల మెడపట్టుకుని బయటకు గెంటేస్తారని వైసీపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా, అంత శక్తి సజ్జల రామకృష్ణారెడ్డికి వుందా.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.!
