Home » బీచ్ వైబ్స్.! కాజల్ అండ్ నిషా అగర్వాల్ సాగర్ చిల్స్.!

బీచ్ వైబ్స్.! కాజల్ అండ్ నిషా అగర్వాల్ సాగర్ చిల్స్.!

by Mudra369 Editorial Desk
0 comments
Kajal Nisha Aggarwal

Kajal Nisha Beach Vibes.. ఎక్కడైనా సరే.. ఇద్దరు అక్కా చెల్లెళ్లు కలిస్తే ఆ సందడే వేరు. అగర్వాల్ ఇంట కూడా అదే సందడి నెక్స్‌ట్ లెవల్ వుంటుంది.

అదేనండీ.! అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇంట.!

కాజల్ అగర్వాల్‌కి తన చెల్లెలు నిషా అగర్వాల్ అంటే చాలా చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా తన ఆ ఇష్టాన్ని వీలు చిక్కినప్పుడల్లా కాజల్ చూపించుకుంటూనే వుంటుంది.

తాజాగా నిషా అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా కాజల్ అగర్వాల్ తన చెల్లెలితో చాలా టైమ్ సరదాగా స్పెండ్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ మురిసిపోతోంది కాజల్ అగర్వాల్.

వాటిలో ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు సముద్ర తీరంలో హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు మరింత హల్ చల్ చేస్తున్నాయ్ నెట్టింట.

Kajal Nisha Beach Vibes.. అలల సవ్వడిలో అక్కచెల్లెళ్ల చిరునవ్వులు.!

తెల్లటి ఇసుక తిన్నెలపై పడుకుని అన్నింటినీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా బీచ్ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వున్నారు ఈ పిక్‌లో.

అలాగే జలకాలాటలలో అంటూ.. చిన్నపిల్లల్లాగే అలల మధ్య అందంగా నవ్వుతూ ఆడుకుంటున్నారు అగర్వాల్ సిస్టర్స్.

ఎటువంటి కల్మషం లేని చిరునవ్వులు ఈ అక్క చెల్లెల్లిద్దరి ముఖంలోనూ సుస్పష్టంగా కనిపిస్తున్నాయ్ కదా.

Kajal Nisha Aggarwal
Kajal Nisha Aggarwal

ఎటువంటి హంగూ ఆర్భాటం లేని ఈ స్వచ్ఛమైన చిరునవ్వు వీరిద్దరి మధ్య ఒకరంటే ఒకరికి వున్న స్వచ్ఛమైన ప్రేమని ప్రతిబింబిస్తోంది.

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఎప్పుడూ బిజీగానే వుంది. కానీ, ప్రొఫిషనల్‌గా ఎంత బిజీగా వున్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్‌కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తూనే వుంటుంది.

ఓ వైపు తన భర్త, పిల్లల్ని చూసుకుంటూనే.. తన చెల్లెలితో సమయం కేటాయించడానికీ వెనుకాడదు.

Kajal Nisha Aggarwal
Kajal Nisha Aggarwal

అందుకే ఈ అగర్వాల్ సిస్టర్స్ ఆల్వేస్ వెరీ స్పెషల్.. అంటూ ఈ బ్యూటిఫుల్ పిక్స్‌కి నెటిజన్ల నుంచి బ్యూటిఫుల్ కామెంట్స్ పోటెత్తుతున్నాయ్.

అదే సమయంలో, వీళ్ళిద్దర్నీ ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే వున్నారు. తమని ట్రోల్ చేసేవాళ్ళని ర్యాగింగ్ చేయడానికా.? అన్నట్లు కాజల్ పదే పదే ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group