Home » ఐవరీ లుక్స్‌లో తమన్నా భాటియా.. న్యూ స్టైలింగ్ అదరహో.!

ఐవరీ లుక్స్‌లో తమన్నా భాటియా.. న్యూ స్టైలింగ్ అదరహో.!

by Mudra369 Editorial Desk
0 comments
Tamannaah Bhatia

Tamannaah Bhatia Ivory Styling.. రెండు దశాబ్ధాల సుదీర్ఘమైన కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది తమన్నా భాటియా.

తమన్నా పనైపోయిందనుకున్నప్పుడల్లా.. మళ్లీ మళ్లీ కొత్తగా సరికొత్తగా అవకాశాలు దక్కించుకుంటూనే వుంటోంది తమన్నా భాటియా.

అందుకు కారణం తమన్నా డెడికేషన్ అండ్ డిసిప్లెయిన్ అని తమన్నాతో నటించిన చాలా మంది హీరోలు చెప్పడం విశేషం. కథక్ డాన్సుల్లో ప్రావీణ్యం వున్న తమన్నాకి డాన్స్ అంటే ప్రాణం.

క్లాసికల్ అయినా.. మాస్ వెస్ట్రన్ డాన్స్ అయినా ఇరగదీసేస్తుంటుంది. అందుకే హీరోయిన్‌గా బిజీగా వున్న టైమ్‌లో కూడా తమన్నా కోసం స్పెషల్ సాంగ్స్ అవకాశాలు ఒకదాని మీద ఒకటిగా పుట్టుకొచ్చేవి.

స్పెషల్ సాంగ్స్‌కి ఓకే చెప్పడం అంత ఆషామాషీ కాదు. కానీ, అందులోనూ ట్రెండ్ క్రియేట్ చేసింది తమన్నా తనదైన డాన్సింగ్ స్టెప్పులతో.

నిజానికి, స్పెషల్ సాంగ్స్‌కి సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టింది తన డాన్స్ మూమెంట్స్‌తో తమన్నా భాటియా అనడం అతిశయోక్తి కాదేమో.

Tamannaah Bhatia Ivory Styling.. మెగా హీరోయిన్..

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన స్పెషల్ సాంగ్స్ అన్నీ ట్రెండింగ్ సాంగ్స్ కావడం విశేషం. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా బోల్డ్ కంటెంట్‌తోనూ మెప్పించి ఒకానొక టైమ్‌లో షాకిచ్చింది తమన్నా.

దాంతో, ఒకింత నెగిటివటీ మూట కట్టుకున్నప్పటికీ, నటి అంటే అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే అని సింపుల్‌గా వాటిని పక్కన పెట్టేస్తుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి సరసన రీ ఎంట్రీ తర్వాత వరుసగా మూడు సినిమాల్లో నటించింది తమన్నా. మెగా కాంపౌండ్ నుంచి తమన్నా ఖాతాలో లెక్కలేనన్ని సక్సెస్‌లున్నాయని చెప్పడం అతిశయోక్తి అనిపించదు.

స్లైలింగ్ క్వీన్..

ఇక, స్టైలింగ్ విషయానికి వస్తే.. ట్రెండ్స్ ఫాలో చేయడమే కాదు.. ట్రెండ్స్ సెట్ చేయడంలోనూ తమన్నా ముందుంటుంది.

తాజాగా ఓ డిఫరెంట్ అవుట్ ఫిట్‌లో తమన్నా భాటియా కనిపించి నెటిజన్స్‌కి షాకిచ్చింది.

ధోతీ టైప్ కాస్ట్యూమ్ అది. క్రీమ్ కలర్ విత్ గోల్డెన్ డిజైన్ అవుట్ ఫిట్. డిఫరెంట్ ప్యాటర్న్‌తో డిజైన్ చేయబడిన ఈ అవుట్ ఫిట్‌లో తమన్నా రాజసంగా ఒదిగిపోయింది.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

అదే సమయంలో, తమన్నా ధరించిన ఈ వింటేజ్ రాయల్ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా జ్యుయలరీ సెట్ చేసుకుంది.

ఆల్ గోల్డ్ ప్యాటర్న్. కంఠానికి ఓ కడ్డీ డిజైన్ చోకర్‌తో పాటూ, పొడుగాటి బంగారు గొలుసును ధరించి డిఫరెంట్ కాంబో సెట్ చేసింది.

Also Read: ‘అర్జున్ రెడ్డి’ భామ.! అల్ట్రా గ్లామరస్ సొగసు చూడతరమా.!

చేతి వేళ్లకు నిండుగా వుంగరాలూ, అలాగే బ్రాస్‌లెట్ చెవులకు సింపుల్ స్టడ్స్.. ఇలా అన్నీ గోల్డ్ ప్యాటర్న్‌లోనే డిజైన్ చేయించుకుంది.

డ్రస్సూ, జ్యుయలరీ, స్లైలింగ్ అంతా ఓ ఎత్తు.. నుదుటున ధరించిన చక్కటి ఎర్రటి బొట్టు ఇంకో ఎత్తు.

అచ్చమైన ఇండియన్ సాంప్రదాయం ఉట్టిపడేలా టోటల్ అవుట్ ఫిట్‌ని తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది ఈ ఎర్రటి బొట్టు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group