Artificial Intelligence Answerless Question.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అనూహ్యంగా ఎదుగుతోంది. ఒకదాన్ని మించిన టూల్ ఇంకోటి వస్తోంది.!
కాలక్షేపం కోసం ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత ప్రశ్నలు, వైద్యారోగ్యం గురించిన ప్రశ్నలు.. వాట్ నాట్.. ఏమన్నా అడగండి, బదులిచ్చేస్తున్నాయి ఏఐ టూల్స్.
క్లిష్టమైన కంప్యూటర్ కోడింగ్ క్షణాల్లో రాసిచ్చేసే ఏఐ టూల్స్ చాలానే అందుబాటులో వున్నాయి. ఏఐ టూల్స్ వాడని రంగం దాదాపుగా ఏదీ లేదిప్పుడు.!
భవిష్యత్ అంతా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌దే.. అంటే, కాదు కాదు.. ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్ అంతా.. అనే చర్చ జరుగుతోంది.
Artificial Intelligence Answerless Question.. ఏఐ కంటే శక్తివంతమైన టూల్స్ సృష్టించబడితే..
ఏఐ టూల్స్, తమకు తాముగా తమకంటే శక్తివంతమైన టూల్స్‌ని తయారు చేయగలిగితే.? అన్న ఆలోచనే, మనకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇదే ప్రశ్నని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ దేన్నయినా అడగండి, మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది.! ఏమో, భవిష్యత్ ఎలా వుంటుందన్నదానిపై ఏఐ టూల్ ఏదీ క్లారిటీ ఇవ్వడంలేదు.

పరిస్థితి చెయ్యిదాటిపోతోంది మహాప్రభో.. అంటూ, ఏఐ టూల్స్ విషయమై.. వాటిల్లో పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే సాంకేతిక విప్లవంతో. అదే సమయంలో, పనులు చాలా తేలికైపోతున్నాయ్ కూడా.!
అతి సర్వత్ర వర్జయేత్..
ఈ పరిస్థితిపై ఆనందించాలో, ఆందోళన చెందాలో కూడా అర్థం కాని దుస్థితి. అతి సర్వత్ర వర్జయేత్.. అని పెద్దలు చెబుతుంటారు. దాన్ని మనం ఇప్పుడు ఫాలో అయ్యే పరిస్థితే లేదు.
ఔను, ప్రవాహంలో కొట్టుకు పోవాల్సిందే.! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం ఏ తీరానికి చేరుతామన్నదానిపై ఓ స్పష్టత ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు.

‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ని నియంత్రించాలంటూ ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెళుతున్నాయ్.. కానీ, ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వరకూ ఎదిగాక.. దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం.
ప్రస్తుతం మనం ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనే మైలు రాయిని కూడా దాటేశామేమో.. అన్న అనుమానాలూ కలుగుతున్నాయ్.!