Table of Contents
NVDIA Jensen Huang Illegal Affair.. ఒక చిన్న తప్పటడుగు, అతని జీవితాన్ని మార్చేసిందా.? ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన అతని కీర్తి, అదఃపాతాళానికి పడిపోయిందా.?
జెన్ హువాంగ్ అంటే, చాలామందికి తెలియకపోవచ్చు.. ఎన్విడియా చీఫ్ జెన్ హువాంగ్ అంటే మాత్రం, ‘టెక్’ రంగంలో తెలియనివారు ఎవరూ వుండరు.
కంప్యూటర్ వినియోగదారులు ఈ ఎన్వీడియా గురించి కథలు కథలుగా చెప్తుంటారు.. అదీ, చాలా గొప్పగా. అందుక్కారణం, ఎన్విడియా చిప్స్.!
అత్యంత పవర్‌ఫుల్ కంప్యూటర్లు, ఎన్విడియా చిప్స్‌తోనే నడుస్తాయ్.! ప్రపంచ వ్యాప్తంగా ఈ విభాగంలో ఎన్విడియాకి తిరుగులేదంతే.!
NVDIA Jensen Huang Illegal Affair.. బిల్ గేట్స్ బాటలోనే జెన్ హువాంగ్ కూడా..
అలాంటి గొప్ప కంపెనీకి, సీఈఓ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా.! ఓ బిల్ గేట్స్.. ఓ జెన్ హువాంగ్.. ఇలాా చెప్తుంటారు, టెక్ రంగంలో ఎన్విడియా చీఫ్ గురించి.
ఆ బిల్ గేట్స్ ఎలాగైతే, జీవిత చరమాకంలో అక్రమ సంబంధాల ఆరోపణలు ఎదుర్కొన్నాడో.. ఈ జెన్ హువాంగ్ కూడా అలానే అక్రమ సంబంధాల ఆరోపణల్లో ఇరుక్కుపోయాడు.
చైనాకి చెందిన గూఢచారి అలీస్ హువాంగ్ అలియాస్, లీ హువాంగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు జెన్సన్ హువాంగ్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ధృవీకరించడం గమనార్హం.
తప్పు చేసినట్లు జెన్సన్ హువాంగ్ స్వయంగా ఒప్పుకోవడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంస్థ పేరు ప్రఖ్యాతులూ మంటగలిసిపోయాయి రాత్రికి రాత్రే.
అమెరికా భద్రతా రహస్యాలు..
అమెరికా భద్రత మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్విడియా వినియోగదారుల డేటా భద్రతపైనా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, డేటాకి వచ్చిన ముప్పేమీ లేదనీ, అమెరికా భద్రతకూ ఎలాంటి ముప్పూ లేదని ప్రాథమికంగా నిర్ధారించాయి దర్యాప్తు సంస్థలు.
జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంలో పొరపాటు జరిగితే, అది సంస్థకు లేదనీ, సంస్థకు ఆయన చేసిన సేవలు చాలా గొప్పవనీ, సంస్థ సీఈవోగా జెన్సన్ హువాంగ్ కొనసాగుతారని ఎన్విడియా సంస్థ ప్రకటించడం గమనార్హం.
టెక్ దిగ్గజాలు ఇలా అక్రమ సంబంధాల ఉచ్చులో కూరుకుపోయి, ఆయా సంస్థల ప్రతిష్టను దిగజార్చేయడం ఇదే కొత్త కాదు.! ఇంతకు ముందు చాలా సంస్థలు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయి.
పని ఒత్తిడి.. ఓ కుంటి సాకు..
పని ఒత్తిడి సహా, అనేక కారణాలు ఇలా ఉన్నత పదవుల్లో వున్న వ్యక్తులు పక్కదారి పట్టడానికి కారణాలుగా మానసిక నిపుణులు అభిర్ణిస్తున్నారు.
మరోపక్క, చైనా గూఢచర్యంలో భాగంగానే జరిగిన హనీ ట్రాప్‌లో జెన్సన్ హువాంగ్ చిక్కుకుపోయాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సింగపూర్‌కి చెందిన డేటా సెంటర్ కంపెనీ ‘మెగా స్పీడ్’లో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది అలీస్ హువాంగ్.
అమెరికా ఆంక్షల్ని కాదని, అలీస్ హువాంగ్ ద్వారా చైనాకి, ఎన్విడియా చిప్స్ అలాగే, వాటితోపాటు అమెరికా భద్రత రహస్యాల్ని చేరవేస్తున్నాడన్నది జెన్సన్ హువాంగ్‌పై ప్రస్తుతం వున్న ఆరోపణ.