Home » బిగ్ క్వశ్చన్: వైఎస్ జగన్ పాదయాత్ర ముందే మొదలవుతుందా.?

బిగ్ క్వశ్చన్: వైఎస్ జగన్ పాదయాత్ర ముందే మొదలవుతుందా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Mohan Reddy

Ys Jagan Padayatra Prepone.. ఒకప్పటి పాదయాత్రలు వేరు.. ఇప్పుడు పాదయాత్రల పట్ల రాజకీయ పార్టీలు, ప్రజల ఆలోచనలు వేరు.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకీ చాలా తేడా.!

ఖర్చు.. మామూలు ఖర్చు కాదు.! వందల కోట్లు ఖర్చు చెయ్యాలి ఈ రోజుల్లో పాదయాత్రలంటే.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.!

అయితే, రాజకీయ పార్టీలకీ రాజకీయ నాయకులకీ ఖర్చు అనేది పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే, ‘రిటర్న్స్’ అనేదే అసలు సమస్య.!

రిటర్న్స్ అంటే, డబ్బు రూపంలో కావొచ్చు.. కాకపోనూవచ్చు.. పదవి రూపంలో ఖచ్చితంగా ‘రిటర్న్స్’ ఆశిస్తారు రాజకీయ నాయకులు.!

Ys Jagan Padayatra Prepone.. ముందుగానే ప్రారంభమవుతుందా.?

గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేసినా, త్వరలో వైఎస్ జగన్ మళ్ళీ పాదయాత్ర చేయనున్నా.. ఈ ఔత్సాహిక రాజకీయ నాయకుల కోర్కెలే కీలకం.!

వచ్చే ఏడాది చివర్లో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కావాల్స వుంది. అయితే, అది కాస్త ముందుగానే ప్రారంభమవుతుందనే సంకేతాలు వస్తున్నాయ్.

వైసీపీ అను‘కుల’ మీడియా ద్వారా వైసీపీ, ఈ ముందస్తు పాదయాత్ర సంకేతాలు పంపుతుండడం గమనార్హం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, వైఎస్ జగన్ పాదయాత్ర ‘ముందుకు జరుగుతుంది’ అట.

వైఎస్ జగన్ ఎప్పుడు పాదయాత్ర మొదలు పెట్టినా, జన ప్రభంజనం ఖాయమని వైసీపీ చెప్పడంలో వింతేమీ లేదు. అలాగే చెప్పాలి కూడా.!

అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా..

కానీ, ఒకప్పటిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రజల్ని ఆకట్టుకోగలరా.? ‘అధికారంలో వున్నప్పుడు ఏం చేశావ్.?’ అన్న ప్రశ్న వస్తే, ఆయన ఏం సమాధానమిస్తారు.? అన్నదే కీలకం.

ఇదిలా వుంటే, సొంత జిల్లా కడప నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డీలా పడింది 2024 ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజానికి, ఆ తర్వాత ఇప్పటిదాకా కోలుకోలేదు కూడా.!

మరి, ఈ పరిస్థితుల్లో పార్టీకి జవసత్వాలు కూడగట్టడానికి వైఎస్ జగన్ పాదయాత్ర ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలే, వైఎస్ జగన్ పాదయాత్రలో చర్చనీయాంశాలవుతాయన్నది నిర్వివాదాంశం. అదే, వైఎస్ జగన్ క్యాంపెయినింగ్‌కీ ఉపయోగపడుతుంది.

పాదయాత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త కాదు. అయితే, ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం తర్వాత, ప్రతిపక్ష హోదా కూడా దక్కని చేదు అనుభవాన్ని చవిచూసిన జగన్, పాదయాత్ర.. కాస్త భిన్నమైనదే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group