బిగ్ బాస్ హౌస్‌లో (Bigg Boss 3 Telugu) మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ గ్లామరస్ బ్యూటీ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం శ్రీముఖి అనే. బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గానే కాదు, వెండితెరపైనా పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి (Sree Mukhi), బిగ్ హౌస్‌లో ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందోనని చాలామంది బుల్లితెర వీక్షకులు ఆమె మీద చాలా ఆశలు (Sree Mukhi Hot) పెట్టుకున్నారు.
అయితే, శ్రీముఖి అడపా దడపా తప్పితే, ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా తన టాలెంట్‌ని బయటపెట్టడంలేదు. కాస్తంత గ్లామరస్‌గా అప్పుడప్పుడూ కన్పిస్తోన్న శ్రీముఖి, తన నేచురల్ బ్యూటీతో హౌస్‌కి గ్లామర్ తెస్తూనే, కొన్ని విషయాల్లో బిగుసుకుపోయి వుండడంతో బిగ్ షో ‘చేదు’గా మారిపోతోంది.
మరీ ముఖ్యంగా, రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) విషయంలో శ్రీముఖిని చూస్తున్న ప్రతిసారీ బుల్లితెర వీక్షకులకి ఒకింత ఇబ్బందికరంగా వుంటోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద శ్రీముఖి మాత్రమే కాదు, బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా అపార్థంతో నిందలు వేసేశారు. ‘నేను శ్రీముఖి యాంకరింగ్ మీద కామెంట్ చెయ్యలేదు మొర్రో..’ అని ఎంత మొత్తుకుంటున్నా, రాహుల్‌కి క్లీన్ చిట్ రావడంలేదు.
‘నిన్ను క్షమించే ప్రసక్తే లేదు..’ అంటూ రాహుల్ మీద తాజాగా విరుచుకుపడిపోయింది శ్రీముఖి. అంతకు ముందు, ‘పంచదార బొమ్మా బొమ్మా..’ పాటలో బాబా భాస్కర్‌తో అత్యద్భుతంగా డాన్స్ చేసిన శ్రీముఖి, రాహుల్ విషయం వచ్చేసరికి చంద్రముఖిలా మారిపోవడం గమనార్హం. అన్నట్టు, అషు రెడ్డిని సపోర్ట్ చేసే క్రమంలో రవి కృష్ణని పక్కకు తోసెయ్యాలని ‘బిగ్ టాస్క్’ సందర్భంగా శ్రీముఖి ప్రయత్నించినా, బాబా భాస్కర్ ఆమె ఆలోచనల్ని తిరస్కరించడం గమనార్హం.
బిగ్ హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నది శ్రీముఖి మాత్రమేనని ఆల్రెడీ సంకేతాలు వెళ్ళిపోయాయి. అయితే, అదంతా నిజమేనా.? అంటే చెప్పలేం. ఎందుకంటే, హౌస్‌లో ఏం జరుగుతోందో మనకి పూర్తిగా తెలియదు. ‘హాట్’ అనుకున్న కంటెంట్ మాత్రమే అక్కడ ప్రసారమవుతోంది. శ్రీముఖి, రాహుల్ విషయంలో కాస్త కూల్ అయితే, బిగ్ హౌస్‌లో ఫన్ ఇంకా ఎక్కువ అవుతుంది.
శ్రీముఖి దెబ్బకి రాహుల్ పూర్తిగా డల్ అయిపోయాడు. హౌస్‌లో వుండడానికి సైతం రాహుల్ ఇష్టపడలేని పరిస్థితి ఏర్పడుతోంది. అంతా శ్రీముఖి కారణంగానే. శ్రీముఖిని (Sree Mukhi Hot) ఇంకా రాహుల్ తన ఫ్రెండ్ అనుకుంటున్నాడుగానీ, ‘హౌస్‌లో నువ్వు వుంటే ఎంత.? లేకపోతే ఎంత.?’ అని శ్రీముఖి తేల్చేయడం గమనార్హం.