ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టుంది వ్యవహారం. సినీ పరిశ్రమ ద్వారా బోల్డంత పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరోయిన్ ఇలియానా (Ileana D Cruz Shocking Allegations On Film Industry), ఇప్పుడు ఆ సినీ పరిశ్రమలోని లోటుపాట్ల గురించి దీర్ఘాలు తీసేస్తోంది, చాలా గట్టిగా. సినీ పరిశ్రమ అత్యంత ఘోరమైనదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది.
పేరు, గుర్తింపు సినీ పరిశ్రమలో తాత్కాలికం అనీ, ఫెయిల్యూర్స్ వస్తే కెరీర్ ముగిసినట్లేననీ, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరనీ ఇలియానా వాపోయింది. సినీ పరిశ్రమను గ్లామరస్ ప్రపంచంగా అభివర్ణిస్తారు. అలాగని, ఇక్కడ కేవలం గ్లామర్ మాత్రమే కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటే అది పెద్ద తప్పిదమే.
బాల నటిగా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్ అయి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి.. సినిమాల్లో నటిస్తూనే తుదిశ్వాస విడిచినవాళ్ళూ ఎంతోమంది వున్నారు. కొత్త నీరు వస్తే, సహజంగానే పాత నీరు.. కనిపించదు. ఇలియానా (Ileana D Cruz Bikini) కూడా, చాలామంది హీరోయిన్లు ఔట్ అయిపోవడంతో అవకాశాలు దక్కించుకున్నదే కదా.
అయినా, ఇలియానాకి (Ileana D Cruz Hot) ఎన్ని ఫ్లాపులొచ్చినా ఇంకా అవకాశాలు వస్తూనే వున్నాయి. అవకాశాలొచ్చిన ప్రతిసారీ, రెమ్యునరేషన్ విషయంలో గట్టిగానే డిమాండ్ చేస్తోంది ఈ బ్యూటీ. కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకున్న రోజుల్ని ఇలియానా (Ileana Hot and Spicy) మర్చిపోతే ఎలా.?
వివాదాస్పద కామెంట్లు చేస్తే, పబ్లిసిటీ ఫ్రీగా లభిస్తుందనే కోణంలో మాత్రమే ఇలియానా (Ileana D Cruz Shocking Allegations On Film Industry) ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుండాలి తప్ప.. అసలామె వ్యాఖ్యల్లో అర్థమే లేదన్నది సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.