మోహన్ బాబు రౌడీయిజం చేశారట. బూతులు తిట్టారట. కానీ, మోహన్ బాబు (Manchu Mohanbabu) చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj)చాలా మంచోడట. విష్ణు (Manchu Vishnu) ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడట. ‘మా’ ఎన్నికలు వింత రసాభాసగా మారడానికి నరేష్ కారణమట. కలిసి పని చేయలేం. అందుకే గెలిచిన పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకాష్ రాజ్ ప్యానెల్ (Maa Fight Prakash Raj Vs Vishnu) విజేతలు కుండ బద్దలుకొట్టేశారు.
రాజకీయాల్లోనే అనుకున్నాం. సినిమా రంగ రాజకీయాల్లోనూ బూతులుంటాయ్. రౌడీయిజం ఉంటుంది.. అని మొట్ట మొదటిసారిగా వింటున్నాం. దేనికోసం ఇదంతా.? సినిమా పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయాయి. నానా హంగామా నడుమ ఎన్నికలు జరిగితే, గెలిచినోళ్లు, తమ పదవులను వెంట్రుక ముక్కల్లా పీకి అవతల పడేశారు.
ప్రకాష్ రాజ్ తెలివైన ఎత్తుగడ..
పదవిలో ఉండి, రోజూ గొడవ పడడం కంటే, బయటికొచ్చేయడం బెటర్.. అని ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ విజేతల ఉవాచ. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ప్యానెల్ విజేతలు ఏదైనా అంశంపై ‘మా’ అధ్యక్షుడు విష్ణును నిలదీస్తే, తద్వారా ఏ కార్యక్రమమైనా ఆగిపోయినప్పుడు నెపాన్ని ప్రత్యర్ధుల మీదకు నెట్టేసి, విష్ణు టీమ్ తెలివిగా తప్పించుకుంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా ప్రకాష్ రాజ్ ప్యానెల్ విజేతలు మంచి నిర్ణయమే తీసుకున్నారు.
నెలవారీ రిపోర్టును విష్ణు నుంచి అడుగుతానని ప్రకాష్ రాజ్ చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం. ‘మా’ (Movie Artists Association) భవనం కట్టడం దగ్గర్నుంచి అనేక హామీలు విష్ణు ఇచ్చేసిన దర్మిలా అనుక్షణం విష్ణు అండ్ టీమ్ నానా తంటాలూ పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లని నిలదీయాలంటే (Maa Fight Prakash Raj Vs Vishnu), ఇప్పుడీ కఠిన నిర్ణయం ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ తీసుకోవడం సబబే.
హామీలు నెరవేర్చడం కత్తి మీద సామే..
పెద్ద పెద్ద హామీలిచ్చేశారు.. తమ చేతకానితనాన్ని ఇతరుల మీదకు నెట్టేసే అవకాశమూ మంచు విష్ణు బృందానికి ఉండదు. మరెలా.? పెద్ద చిక్కే వచ్చి పడింది. సాధారణ రాజకీయాలకు మించి ఎత్తులూ, పై ఎత్తులూ చూస్తున్నాం.
తన సొంత డబ్బుతో మా కుటుంబ సభ్యుల సహకారంతో ‘మా’ భవనం కట్టేస్తానన్న మంచు విష్ణు, ఇఫ్పుడీ సినీ రాజకీయ ఆర్ధిక శిరోభారాన్ని మోయగలడా.? మోయలేకపోతే మాత్రం గెలిచిన గెలుపుకి అర్ధం లేదు.
ట్విస్ట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ కొత్త కుంపటి (మా అసోసియేషన్‌కి ధీటుగా మరొకటి) పెడతారనే ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. ఇదొక తెలివైన ఎత్తుగడ అనుకోవాలేమో. తెలుగు సినిమా పట్ల తన కమిట్మెంట్ని ప్రకాష్ రాజ్ నిరూపించుకున్నారు. అంతేకాదు, తన ప్యానెల్ నుంచి గెలిచిన (Prakash Raj Vs Manchu Vishnu) వారెవరూ పక్క చూపులు చూడకుండా మాటకు కట్టుబడి ఉండేలా చేయగలిగాడు.