Home » కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? జగన్.. ఇది నిజమా.?

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? జగన్.. ఇది నిజమా.?

by Mudra369 Editorial Desk
0 comments
Ys Jagan Legislative Council

YSRCP Jagan Congress Merging.. ఆ పార్టీలో ఈ పార్టీ విలీనం.. అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విశ్లేషణలు.. వెబ్ మీడియాలో గాసిప్స్.. సోషల్ మీడియా వేదికగా పుకార్లు సర్వసాధారణం.!

ఈ మధ్యకాలంలో తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల పార్టీ విలీనమైంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిల.

సోదరి షర్మిల బాటలో, అన్న వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీని విలీనం చేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ పుకార్ల పర్వం, వెబ్ మీడియాని దాటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ చేరుకుంది.!

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

తల్లి విజయమ్మని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా నియమించి, వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.

రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు వైసీపీ ప్రారంభించడానికి ముందూ.. ఆ తర్వాత కూడా.! ఈ ప్రయాణంలో వైఎస్ జగన్, ప్రతిపక్ష నేతగా.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఎదిగారు.

YSRCP Jagan Congress Merging.. ఓడిపోయాక బెంగళూరులో తలదాచుకున్న…

2024 ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత పూర్తిగా బెంగళూరుకే పరిమితమైపోయిన వైఎస్ జగన్, అడపా దడపా మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌లో కనిపిస్తున్నారు.

పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడంలేదు కాబట్టి, వైఎస్ జగన్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారన్నది, వినిపిస్తున్న పుకార్ల సారాంశం.

కానీ, అదంత తేలికైన వ్యవహారం కాదు. కాంగ్రెస్ దేశంలో బలపడే పరిస్థితి వుండాలి. ఆ నమ్మకం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిగితే, ఏమో.. ‘విలీనం’ రిస్క్ తీసుకుంటారేమో.

అయినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్‌లో స్థిరమైన ఓటు బ్యాంకు వుంది. దాన్ని వదిలేసుకుని వైసీపీని, కాంగ్రెస్‌లో వైఎస్ జగన్ కలిపేసే అవకాశమే వుండకపోవచ్చు.

ఏమో, గుర్రం ఎగరావచ్చు.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. సో, విలీనం పుకార్లను అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. రాజకీయాల్లో నిప్పు లేకుండా పొగ పుట్టడం సర్వసాధారణం.

అదే సమయంలో, చాలా పుకార్లు.. నిజాలుగా మారడం కూడా చూశాం.!

టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తే, మళ్ళీ 11 సీట్లకే.. లేదంటే, అంతకన్నా తక్కువ సీట్లకు వైసీపీ పరిమితమైపోతే.? ఈ భయాలు ఎక్కువైతే మాత్రం, విలీనం వైపే జగన్ మొగ్గు చూపొచ్చు.

‘పొత్తు’ ఆప్షన్ వుండగా, విలీనం వైపు జగన్ ఎందుకు మొగ్గు చూపుతారన్నదీ ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే, పొత్తు కంటే విలీనంపైనే కాంగ్రెస్‌కి మక్కువ ఎక్కువ. కాంగ్రెస్ రాజకీయాలు అలానే వుంటాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group