Chiranjeevi 48 Years Acting Career.. కొణిదెల శివ శంకర వర ప్రసాద్.. అసలు పేరు.! సినిమా పేరు చిరంజీవి.! ఆ చిరంజీవే, ఇప్పుడు శాశ్వత గుర్తింపు.!
అదీ, కోట్లాది మంది అభిమానుల ప్రేమతో ఇచ్చిన గుర్తింపు.! చిరంజీవి అంటే, శిఖర సమానం.!
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై ఎవరెస్టు శిఖరమంతటి ఖ్యాతి.! దేశవ్యాప్తంగానూ ‘చిరంజీవి’ అన్న పేరుకు వున్న గుర్తింపు అంతా ఇంతా కాదు.
ఇంతకీ, కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌కి చిరంజీవి అనే పేరు ఎవరు పెట్టారు.? ఎవరో కాదు, తనకు తానే పెట్టుకున్నానని చిరంజీవి చెబుతుంటారు.
‘ఆ రోజు చిరంజీవి అనేది నేను పెట్టుకున్న పేరు.. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వత గుర్తింపు’ అంటూ చిరంజీవి, ఎమోషనల్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా.
కారణం, నేటితో నటుడిగా చిరంజీవి 48 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సినిమాకి నలభై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి.
అంటే, నటుడిగా చిరంజీవి నలభై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్నట్లే కదా.! ఇంకో రెండేళళతో.. అర్థ శతాబ్దం పూర్తవుతుంది.
Chiranjeevi 48 Years Acting Career.. స్ఫూర్తి కెరటం చిరంజీవి అంటే..
నటుడిగా నలభై ఎనిమిదేళ్ళు.. వయసు రీత్యా చూస్తే.. ఏడు పదులు.. డెబ్భయ్ ఏళ్ళ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి, తన తొలి సినిమాకి కష్టపడుతున్నట్లే కష్టపడుతున్నారు.
చిరంజీవి నుంచి ‘విశ్వంభర’ సినిమా రాబోతోంది. ‘కాకా’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే సినిమా పట్టాలెక్కాల్సి వుంది.
సినీ పరిశ్రమలో చిరంజీవి చూడని రికార్డులు లేవు. చెయ్యని పాత్రలు లేవు. రికార్డులు చిరంజీవి పేరు మీదనే వుంటాయ్. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడమే చిరంజీవి ప్రత్యేకత.! ఇప్పటికీ, సెట్స్‌లో చిరంజీవి నిత్య విద్యార్థిలా కనిపిస్తారని ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు, తోటి నటీనటులు చెబుతుంటారు.
‘‘ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది’’ అంటూ చిరంజీవి ట్వీటేశారు.
‘‘అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం’’ అంటున్నారు చిరంజీవి ప్రేక్షకుల్ని ఉద్దేశించి.
‘‘నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ ఇదీ చిరంజీవి నలభయ్యెనిమిదేళ్ళ నట ప్రస్తానం నేపథ్యంలో చేసిన వ్యాఖ్య.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో రికార్డు స్థాయి వసూళ్ళు.. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్.. వాట్ నాట్.. చిరంజీవి అందుకున్న ‘ప్రేమ’ అంతా ఇంతా కాదు.!
అన్నిటికీ మించి, చిరంజీవి అంటే ఓ స్ఫూర్తి కెరటం.!
