Radhika Apte Lust Stories.. పేరే ‘లస్ట్ స్టోరీస్’.! అందులో కంటెంట్ ఏముంటుందో టైటిల్‌ని బట్టి చెప్పేయొచ్చు.! విమర్శలు, వివాదాలెలా వున్నా, సీజన్స్ మీద సీజన్స్ పుట్టుకొస్తూనే వున్నాయి.
తాజాగా, మూడో సీజన్ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం నాలుగు కథలు. అందులో ఓ కథలో రాధిక ఆప్టే నటించింది.!
స్నేహితురాలేమో, తన భర్త మీద మోహం పెంచుకుంటుంది. ఆ స్నేహితురాలి కోరిక తీర్చడానికి, తానూ.. ఆ స్నేహితురాలి భర్త మీద కన్నేస్తుంది.!
‘భర్తల మార్పిడి’ అన్నమాట.. అసలు కాన్సెప్ట్.! స్నేహితురాలికి ఆమె కోరుకున్నది వర్కవుట్ అవ్వదు. వేరే ఆప్షన్ చివర్లో ఎంచుకున్నట్లు చూపించారనుకోండి.. అది వేరే సంగతి.
Radhika Apte Lust Stories.. నటించమంటే జీవించేసినట్టుంది..
ఇక, రాధిక ఆప్టే.. తన భర్తతో శృంగారం విషయంలో రెచ్చిపోయింది.! నటించమంటే, జీవించేసింది రాధిక ఆప్టే. భర్త పాత్రలో విజయ్ వర్మ నటించాడు.
అయినా, రాధిక ఆప్టేకి ఇలాంటి ‘బోల్డ్’ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అందులో మాస్టర్ డిగ్రీ చేసేసింది రాధిక ఆప్టే.!
కెమెరా ముందర చేయాలసిందంతా చేసేసి, కాస్టింగ్ కౌచ్.. లాంటి డైలాగులు రాధిక ఆప్టే పేల్చుతుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: అప్పుడే పెళ్ళేంటి.? నేనింకా చాలా సినిమాలు చెయ్యాలి.!
గతంలో అన్వేషి జైన్, కైరా అద్వానీ, తమన్నా.. ఇలా పలువురు స్టార్లు ‘లస్ట్ స్టోరీస్’ చేసేశారు. మొదటి సీజన్ హాటెస్ట్.. రెండో సీజన్ అంతకు మించి.! మూడో సీజన్.. దాదాపుగా తుస్సుమన్నట్లే.
అన్నట్టు, మూడో సీజన్‌లో నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావు హైదరీ, సిద్దార్ధ్ కలిసి నటించడం గమనార్హం.
మొత్తమ్మీద, ఈ వల్గారిటీనీ.. ఈ జుగుప్సనీ.. ఇప్పుడు ఓటీటీల్లో కూడా భరించలేకపోతున్నారు వీక్షకులు.! అందుకేనేమో, గత కొంతకాలంగా ఈ తరహా కంటెంట్ పెద్దగా ఓటీటీలో వర్కవుట్ కావడంలేదు.
ఒకప్పుడు పరిస్థితి వేరు.! ఇప్పటి పరిస్థితి వేరు.!