Home » అబ్జర్వేషన్.! నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా.?

అబ్జర్వేషన్.! నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా.?

by Mudra369 Editorial Desk
0 comments
Narendra Modi Operation Sindoor

Nandra Modi BJP Downfall.. దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్యాయ రాజకీయ శక్తి ఏముంది.? ఇంకేముంది.. కాంగ్రెస్ పార్టీనే.! ఏంటీ, నిజమేనా.. కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా వుందా.?

ఎన్డీయే కూటమి వర్సెస్ ఇండీ కూటమి.. ఇదీ దేశంలో ప్రస్తుతం పొలిటికల్ సినారియో.. ఈ రెండు కూటముల మధ్యనే రాజకీయ పోరాటం నడుస్తోంది.

గత ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించాల్సిన బీజేపీ, మిత్రపక్షాల సాయంతో గట్టెక్కిన సంగతి తెలిసిందే. అలాగని, ప్రతిపక్షం కాంగ్రెస్ బలం పుంజుకుందా.? అంటే, ప్చ్.. పెద్దగా ఏం లేదు.

2024 ఎన్నికల తర్వాత అయినా, కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుందా.? అంటే, అదీ లేదు.! నో డౌట్, దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ్.

Nandra Modi BJP Downfall.. ముచ్చటగా మూడోసారి.. అందుకే, ఆ కాస్త వ్యతిరేకత..

వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.! ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ.! దాంతో, సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత వుంటుంది.

కొంత కాదు, చాలా ఎక్కువే కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.! ఈ విశ్లేషణలు ఎప్పుడూ వుండేవే.! కాకపోతే, ‘నీట్’ వివాదంలో విషయం, కేంద్ర మంత్రి రాజీనామా వరకూ వెళ్ళింది మరి.!

ప్రధాని అయ్యాక, నరేంద్ర మోడీ ఎదుర్కొన్న అతి పెద్ద దెబ్బ ఇదే.! అప్పటినుంచే, మోడీకి వ్యతిరేక పవనాలు ఇంకాస్త గట్టిగా వీస్తున్నాయ్.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ ముసుగులో, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద రాజకీయ ఉద్యమమే నడుస్తోంది దేశవ్యాప్తంగా. కాంగ్రెస్ సహా, వివిధ రాజకీయ పార్టీలు, ‘బొద్దింకలకు’ పూర్తి మద్దతిస్తున్నాయి.

2029 ఎన్నికల నాటికి, ఈ బొద్దింకలు మరింత బలపడితే, రాజకీయంగా బీజేపీకి కష్ట కాలమే.!

‘సర్’ వల్ల బీజేపీకి లాభమెంత.?

ఇంకోపక్క, వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేశారు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వానికి మోడీ ‘నో’ చెప్పే అవకాశాలున్నాయన్న ప్రచారం, బీజేపీని మరింత బలహీనం చేసే అవకాశాల్లేకపోలేదు.

నిజానికి, 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది. ‘సర్’ పేరుతో జరుగుతున్న ప్రక్షాళన నేపథ్యంలో, ఫేక్ ఓటర్లు తగ్గి.. ఎన్నికల వ్యవస్థ బాగు పడుతుందనీ, అదే తమకు శ్రీరామరక్ష అని బీజేపీ నమ్ముతోంది.

ఒక్కటి మాత్రం నిజం.. ప్రతిపక్షం బలపడనంతవరకు, అధికార పక్షానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ మాత్రమే.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలూ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో సఖ్యత లేకపోవడం.. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు.

రాహుల్ గాంధీ.. ప్రభావమెంత.?

అన్నటికన్నా ముఖ్యంగా, రాహుల్ గాంధీ టైమ్ పాస్ రాజకీయాలు, బీజేపీకి మేజర్ అడ్వాంటేజ్.. అదే కాంగ్రెస్ పార్టీకి, ఇండీ కూటమికీ అతి పెద్ద డిజడ్వాంటేజ్.!

కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీని అంత సీరియస్‌గా ఎవరూ తీసుకోని పరిస్థితి. రాహుల్ చేతులెత్తేస్తే, ప్రియాంక రంగంలోకి దిగారు. కానీ, కాంగ్రెస్ దుస్థితి మారలేదు.

అయినాసరే, రాహుల్ గాంధీ తమ భావి ప్రధాని అభ్యర్థి.. అంటూ, కాంగ్రెస్ పార్టీలో కొందరు అప్పుడప్పుడూ ఆయనకి ఎలివేషన్స్ ఇస్తూనే వుంటాయ్. ఏం లాభం.? దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

Rahul Gandhi
Rahul Gandhi

‘జోడో యాత్ర’ అన్నారు.. ఇంకోటన్నారు.. ఏం చేసినా, అవేవీ కాంగ్రెస్ పార్టీకి అదనపు ఆకర్షణ అవలేకపోతున్నాయి.

‘రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ’ అన్న భావన, కాంగ్రెస్ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళిపోయింది.

మూడు దఫాలుగా తాము చేసిన, చేస్తున్న అభివృద్ధే తమను గెలిపిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది.

దేశవ్యాప్తంగా జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు.. ఇలా తాము చేసిన అభివృద్ధి చాలా చాలా ఎక్కువన్నది బీజేపీ చెబుతున్నమాట.

పాలన అంత అద్భుతంగా వుంటే, ప్రజా వ్యతిరేకత ఎందుకు.? ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి.? వాటికి ప్రజా మద్దతు ఎలా లభిస్తోంది.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group