Home » ‘వై నాట్’ పులివెందుల.! వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు.!

‘వై నాట్’ పులివెందుల.! వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు.!

by Mudra369 Editorial Desk
0 comments
CBN Ys Jagan Andhra Pradesh Politics

Why Not Pulivendula YSRCP TDP.. రాజకీయాల్లో అసలీ ‘వై నాట్’ ట్రెండ్ ఎప్పటినుంచి మొదలైంది.? ‘వై నాట్ కుప్పం’, ‘వై నాట్ పులివెందుల’.. ఇవన్నీ, 2024 ఎన్నికల్లో విన్నాం, చూశాం.!

అధికార పీఠమ్మీదున్న జగన్ మోహన్ రెడ్డి ‘వై నాట్ కుప్పం’ అంటూ, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై ఆధిపత్య పోరులో భాగంగా ‘మైండ్ గేమ్’ ఆడారు.!

స్థానిక ఎన్నికల సమయంలో, అడ్డగోలుగా అరాచకాలకు తెరలేపి, విపక్షాలేవీ బరిలో నిలబడకూడదన్నట్లుగా రాజకీయ కుట్రలకు తెరలేపింది వైసీపీ.

సార్వత్రిక ఎన్నికల విషయంలోనూ ‘వై నాట్ కుప్పం’ అంటూ పదే పదే వ్యాఖ్యానించేవారు వైఎస్ జగన్. కట్ చేస్తే, 151 సీట్ల నుంచి వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. వైఎస్ జగన్, బెంగళూరుకి వెళ్ళిపోయారు వైసీపీ ఓడిపోయాక.

Why Not Pulivendula YSRCP TDP.. టీడీపీ వర్సెస్ వైసీపీ.. పులివెందుల స్థానిక బరిలో..

ఇప్పుడు టీడీపీ వంతు.! ‘వై నాట్ పులివెందుల’ అంటోంది స్థానిక ఎన్నికల నేపథ్యంలో, పులివెందులలో ఎవరు అధికారంలో వున్నా, ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయ్.

పులివెందుల నియోజకవర్గంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, వైఎస్ కుటుంబం.. తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తోందన్నది సర్వత్రా వినిపించే విమర్శ

ఇప్పుడు ఆ పులివెందులలో పాగా వెయ్యడానికి, టీడీపీ ప్రయత్నిస్తోంది స్థానిక ఎన్నికల నేపథ్యంలో. ఒకవేళ పులివెందులలో గనుక, టీడీపీ అనుకున్నది సాధించగలిగితే అదో సంచలనమే అవుతుంది.

ఒకవేళ పులివెందులలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై, టీడీపీ విజయం సాధిస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

టీడీపీ, అలా అనకూడదా.?

ఏం, పులివెందుల రాజకీయాలపై టీడీపీ ఫోకస్ పెట్టకూడదా.? అంటే, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే.

కానీ, వైసీపీలా హద్దులు దాటి ప్రవర్తిస్తే, అరాచకాలకు తెరలేపితే.. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఏ గతి పట్టిందో, టీడీపీకి కూడా అదే గతి పడుతుందన్నది నిర్వివాదాంశం.

ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ ఎన్నికల్లో అయినా గెలవడం కోసమే ప్రయత్నిస్తుంది. గెలుపు కోసం పదునైన వ్యూహాలు రచించడం తప్పు కాదు.

టీడీపీ కావొచ్చు, వైసీపీ కావొచ్చు.. పులివెందుల వేదికగా రాజకీయ పోరాటం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే, ప్రజలు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

గెలుపోటముల్ని ఇటు టీడీపీ అయినా, అటు వైసీపీ అయినా స్వాగతించాల్సిందే. తప్పదు. చూద్దాం.. పులివెందులలో స్థానిక రాజకీయ యుద్ధం.. ఎలాంటి కొత్త సమీకరణాలకు తెరలేపుతుందో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group