Janhvi Kapoor Chuttamalle Devara.. మొన్నటికి మొన్న ‘పెద్ది’ సినిమా విషయమై జాన్వీ కపూర్‌కి వ్యతిరేకంగా పెద్దయెత్తున ‘పెయిడ్’ ట్రోలింగ్ నడిచింది.
ఇప్పుడేమో, ‘ఏఐ-డీప్‌ఫేక్’ మార్ఫింగ్ వీడియో కూడా, జాన్వీ కపూర్‌కి వ్యతిరేకంగా.. అది కూడా కుట్రపూరితంగా ప్రచారంలోకి వచ్చింది.
సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించడం చాలా ఏళ్ళుగా జరుగుతోంది. పాత తరం నటీమణులు కూడా అత్యంత అసభ్యకరంగా తెరపై కనిపించిన సందర్భాలున్నాయి.
ఈ మధ్యకాలంలో ‘యూత్‌ఫుల్’ సినిమాల పేరుతో, ఏకంగా బూతు కంటెంట్‌ని ప్రేక్షకుల మీద రుద్దేస్తున్నారు దర్శక నిర్మాతలు.!
లిప్ లాక్ సీన్స్, బెడ్‌రూమ్ సీన్స్.. వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! వాటన్నిటితో పోల్చితే, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ప్రదర్శించిన గ్లామర్ ఎక్కువేమీ కాదు కదా.!?
‘పెద్ది’ సినిమాకి వ్యతిరేకంగా నడిచిన పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్, అనూహ్యంగా ‘జాన్వీ కపూర్’ మీద అసభ్యకరమైన ట్రోలింగ్‌గా మారిపోయింది.

అదే, ఆ ముఠానే ఇప్పుడు ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్‌ని ‘ఏఐ-డీప్‌ఫేక్’ మార్ఫింగ్ ద్వారా, జాన్వీ కపూర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందా.?
సోషల్ మీడియాలో ఎవరెవరు ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోల గురించి ప్రచారం చేశారు.? ‘డైరెక్ట్ మెసేజ్’ రూపంలో వీడియోల్ని ఎవరెవరు సర్క్యులేట్ చేశారు.? ఇవన్నీ తేలాల్సి వుందిప్పుడు.
జూనియర్ ఎన్టీయార్, ‘దేవర’ పాట మార్ఫింగ్ విషయమై సీరియస్‌గా స్పందించాక, అతని అభిమానులే ఈ వీడియోల్ని ఎక్కువగా సర్క్యులేట్ చేసినట్లు.. సంబంధిత స్క్రీన్ షాట్స్.. దర్శనమిస్తున్నాయి.
తనను ట్యాగ్ చేస్తూ, పోస్ట్ చేస్తున్న ఆయా స్క్రీన్ షాట్స్ ఆధారంగా జూనియర్ ఎన్టీయార్, తన అభిమానుల మీదనే తొలుత చట్ట పరమైన చర్యలకు ఉపక్రమిస్తే, అదో సంచలనమే అవుతుంది.
ఇలాంటి విషయాల్లో జూనియర్ ఎన్టీయార్ మాత్రమే కాదు, ఏ నటుడు కూడా తప్పుడు పనులు చేసే అభిమానుల్ని ఉపేక్షించకూడదు.
పరిస్థితి తీవ్రత నేపథ్యంలో, జూనియర్ ఎన్టీయార్ ఎంతవరకూ అయినా వెళ్ళి, జాన్వీ కపూర్‌కి న్యాయం జరిగేలా చేస్తాడనే అనిపిస్తోంది.
