ఔనా, అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) డేటింగ్ చేస్తోందా.? అసలెవడు చెప్పాడంట.?
వెబ్ మీడియా ఎంత ఛండాలంగా తయారయ్యిందో అందరికీ తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దిగజారుడుతనంలో కొత్త లోతుల్ని వెతుక్కుంటోంది.
సోషల్ మీడియాలోని ఛండాలమే వార్తా కథనాలు. గాసిప్స్ అనే గాలి వార్తల్ని పోగెయ్యడం కొందరికి బాగా అలవాటైపోయింది. మొదట్లో సెలబ్రిటీలూ వీటిని ప్రోత్సహించారనుకోండి. అది వేరే సంగతి.
Anu Emmanuel మలయాళ భామ.. ఎందుకిలా.?
మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ల సరసన నటించింది.
ప్చ్.. టైమ్ బ్యాడ్, ఆమె తనకు అనూహ్యంగా వచ్చిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోలేకపోతోంది.
అదేంటోగానీ, ఫ్లాపుల మీద ఫ్లాపులు.. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌కి అవకాశాలు బాగానే వస్తున్నాయ్.

అయినా, అందులో ఆమె తప్పేంటి.? సినిమాలు ఫ్లాపయితే, ఆ పాపం హీరోయిన్ మీదకు నెట్టేయడం ఎంతవరకు సబబు.?
ఈ డేటింగ్ రూమర్లేంటి.?
గతంలో రాజ్ తరుణ్‌తో డేటింగ్ అన్నారు.. ఇప్పుడేమో అల్లు శిరీష్‌తో డేటింగ్ అంటున్నారు.! అయ్యపోపం అనూ ఇమ్మాన్యుయేల్‌కే ఎందుకిలా జరుగుతోందో ఏమో.!
ఖండించదు.. అదే అసలు సమస్య.! ఔను, అనూ ఇమ్మాన్యుయేల్ ఇలాంటి గాసిప్స్‌ని ఖండించదు, అసలు పట్టించుకోదు.
అవకాశాలొస్తే సినిమాలు చేస్తుంటుంది.. లేదంటే, గాయబ్ అయిపోతుంటుంది.! ఎక్కువగా విదేశాలకు చెక్కేస్తుంటుంది. అటు కేరళ, ఇటు అమెరికా.. రెండూ ఆమెకు సొంత ప్రాంతాలే మరి.!
Also Read: Samantha Ruth Prabhu.. ఆ నిగూడార్ధం ఏంటి.?
ఇంతకీ, తాజా డేటింగ్ రూమర్ల గోలేంటంటారా.? ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ కలిసి నటించారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిందంటూ ప్రచారం జరుగుతోంది ప్రోమోల పుణ్యమా అని.!
అద్గదీ అసల సంగతి.! మరీ అంత పర్వర్టెడ్ రాతలెలా రాస్తారు.? రాయకపోతే వింత.. ఈ రోజుల్లో. అలా పర్వర్టెడ్ రాతలే జర్నలిజం అయిపోయింది మరి.! చిత్రమేంటంటే మెజార్టీ పాఠకులూ ఇలాంటి ‘స్టఫ్’నే కోరుకుంటుండడం.