Pooja Hegde.. ఆమె వయసు ముప్ఫయ్ రెండు.! అతని వయసేమో 56.! ఇద్దరి మధ్యా వయసు తేడా ఇరవై నాలుగేళ్ళు.!
ఔనా.? నిజమా.? పూజా హెగ్దే పెళ్ళి పీటలెక్కబోతోందా.? అదీ బాలీవుడ్ నటుడితోనా.? అందునా, తనకంటే వయసులో చాలా పెద్దవాడైన ఓ హీరోతోనా.?
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.! ఛ.. అలా అనకండి.! ప్రేమకీ.. పెళ్ళికీ వయసుతో పనేంటి.?
సల్మాన్ ఖాన్‌కి పెళ్ళి కావాల్సొచ్చిందా.?
‘నాకెవరూ పిల్లనివ్వరు.. నాకసలు పెళ్ళి కాదు..’ అని పలు సందర్భాల్లో నవ్వుతూనే సీరియస్‌గా వాపోయాడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ జీవితంలో ఎంతోమంది అందాల భామలున్నారు.. చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత వుంటుంది. సంగీతా బిజిలానీ, ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్, జరీన్ ఖాన్..జాక్వెలైన్ ఫెర్నాండెజ్.. ఇదీ లిస్టు.!
అన్నట్టు, ఈ లిస్టులో డజనుకు పైగా పేర్లుంటాయ్. కాదు కాదు, అర్థ సెంచరీ వరకూ వుండొచ్చంటారు. ఇందులో దాదాపు డజను పేర్లయితే, ప్రేమ ముదిరి పెళ్ళి పీటలదాకా వెళ్ళాయని టాక్.
Pooja Hegde ఈ గాసిప్ సృష్టించినోళ్ళెవరబ్బా.?
ప్రస్తుతానికైతే పెళ్ళి ఆలోచన సల్మాన్ ఖాన్‌కే (Salman Khan) లేదు. పూజా హెగ్దే ఇంకా తనక్కావాల్సినవాడు, తన అభిరుచులకు సరైనోడు.. ఇంకా దొరకలేదని పలు సందర్భాల్లో చెప్పింది.

ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.. బాలీవుడ్ పార్టీల్లో ఇద్దరూ కలిసి తిరుగుతుండొచ్చగాక. అంతమాత్రాన, అక్రమ సంబంధం అటగట్టేస్తారా.? అంటూ పూజా అభిమానులూ, సల్లూభాయ్ అభిమానులూ వాపోతున్నారు.
ఇంతకీ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పెళ్ళెప్పుడు.? అరవైలలోకి వెళుతున్నాడు.. ఇంకా పెళ్ళేంటి.?
Also Read: Rashmika Mandanna.. ఎలగెలగ.! బ్యాన్ చేసేస్తారా.?
సల్మాన్ ఖాన్ (Salman Khan) సంగతి సరే.. పూజా హగ్దే కూడా ముప్ఫయ్‌లలోకి వచ్చేసింది. నలభైలలోకి వచ్చాక పెళ్ళి ఆలోచన చేస్తుందేమో.!
ఆమె పెళ్ళి.. ఆమె ఇష్టం.! కెరీర్ మంచి జోరులో వుండగా ఈ పెళ్ళి గోల ఏంటి.? అంటే, పెళ్ళికీ.. వయసుకీ ఎలాగైతే సంబంధం లేదు.. పెళ్ళికీ.. కెరీర్‌కి కూడా అలాగే సంబంధం లేకుండా పోయిందిప్పుడు.