Ram Gopal Varma.. ‘అంతా నా ఇష్టం.. నచ్చితే నేను తీసే సినిమాలు చూడండి, లేకపోతే మానెయ్యండి’ అని నిజాయితీ (!?) గానే చెప్తాడు ఆర్జీవీ.!
నిజమే.! నచ్చితేనే ఆర్జీవీ సినిమాలు చూడాలి.. నచ్చితేనే ఆర్జీవీ మాటల్ని వినాలి.! కానీ, సెలబ్రిటీ కదా.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు యూ ట్యూబ్ ఛానళ్ళు ఎగబడ్తాయ్.
మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆర్జీవీ చుట్టూ పెరిగెడుతుంది. ఇదో కళ. మీడియాకి ఇప్పుడు ‘రచ్చ’ కావాలి. అది ఆర్జీవీ బోల్డంత ఇవ్వగలడు. అదీ మేటర్.!
మియా పాలకోవా నిజాయితీ..
ఆమె మద్యం సేవించదు.. స్మోకింగ్ కూడా చేయదు.. రాత్రి తొమ్మిదయ్యేసరికి బుద్ధిగా నిద్రపోతుంది.! ఆమె లైఫ్ స్టైల్ అద్భుతమట. ఎవరామె.? ఇంకెవరు, మియా పాలకోవా.! పాలకోవా కాదు, మాల్కోవా.!

ఆ పాలకోవా ‘నిజాయితీ’ మీద మనసుపడి, ఆమెతో ఓ షార్ట్ ఫిలిం తీశాడు. అది అప్పట్లో బోల్డంత రచ్చ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పాలకోవా’ నిజాయితీకి ఆర్జీవీ సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆర్జీవీకి నచ్చిన ‘నిజాయితీ’ అంటే అదెంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
Ram Gopal Varma నచ్చితే మీ ఇష్టం.!
ఆర్జీవీ చెప్పిన ‘నిజాయితీ సూత్రలు’ మీకు నచ్చితే అది మీ ఇష్టం. పదహారేళ్ళ వయసులోనే ‘పో.. స్టార్’ అవ్వాలనే నిర్ణయం పాలకోవా తీసుకుందట.
చట్టపరంగా వయసు సరిపోదుగనుక, 18 ఏళ్ళ వయసు రాగానే, అందులోకి దూకేసిందట. ‘సె..’ అంటే ఇష్టమట పాలకోవాకి. దాన్ని ‘సేఫ్’గా ఎంజాయ్ చెయ్యడానికి సరైన వేదిక ‘పో.. ఇండస్ట్రీ’ గనుక, దాన్ని ఎంచుకుందట.
Also Read: Hamsa Nandini ఈజ్ బ్యాక్.! మళ్ళీ జన్మించాననీ..
నిజాయితీ అదిరిపోయింది కదా.? ఆర్జీవీ (RGV) మార్కు నిజాయితీ అంటే ఇలాగే తగలడుతుంది.
ఇంతకీ, ఆర్జీవీ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు.? సభ్యత సంస్కారం.. ఇలాంటివి ఏవీ ఆయనకి పట్టవ్.! ఎందుకంటే ఆయన ఆర్జీవీ.!
మూర్ఖత్వమే మేధావితనం అనుకునేటళ్ళని ఏం చేయలేం.! దాన్నొక ఎంటర్టైన్మెంట్ అని సరిపెట్టుకోవాల్సిందే.. అది శాడిజం అయినాగానీ.!