Aishwarya Lekhsmi అరరె.! ఏమయ్యిందామెకి.? నిండా ప్రేమలో పడిపోయింది. పైగా, ఆ ప్రేమకి మళ్ళీ బోల్డన్ని రంగులు.! అసలు పెళ్ళి ఆలోచనే లేదనేసింది గతంలో.!
పెళ్ళితో పనేంటి.? పిల్లలుంటే సరిపోతుంది కదా.? అంటూ మొన్నామధ్య ఓ సినిమా ప్రమోషన్ల సందర్భంగా వ్యాఖ్యానించి అందర్నీ విస్మయానికి గురిచేసింది.
కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి మంచి నటి. 2022లో ఏకంగా 8 సినిమాలు విడుదలయ్యాయి.. ఆమె నటించినవి. అందులో ‘పొన్నియన్ సెల్వన్’ కూడా ఒకటి.
Aishwarya Lekhsmi.. ప్రేమలో పడింది.. కానీ ఎవరితో.?
ఈ మధ్య వరుసగా ‘లవ్ సింబర్’ పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. ఆయా వస్త్రాలకు సంబంధించిన రంగులవి.

ఈ క్రమంలోనే ఇంకో ‘లవ్ సింబల్’తో ఓ నటుడితో కలిసి వున్న ఫొటోని షేర్ చేసింది. దాంతో, అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారంతా.
ఆ నటుడెవరో కాదు అర్జున్ దాస్. తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
తూచ్.. ప్రేమా లేదు.. గీమా లేదు..
లవ్ సింబల్ పెడితే.. ప్రేమ, పెళ్ళి అనేనా.? కానే కాదట. ఇద్దరూ ఏదో సందర్భంలోకలిస్తే, ఆ ఫొటోని ఇలా షేర్ చేసిందట ఐశ్వర్య. ఇదో వెర్షన్.
Also Read: Samantha Ruth Prabhu ఆ మెరుపు తగ్గిందేల.?
కాదు కాదు, నిండా ప్రేమలో మునిగి తేలుతున్నారిద్దరూ.. అంటూ ఇంకో వెర్షన్ కూడా ప్రచారంలో వుంది. ఏది నిజం.? ఏమో, ఆమెకే తెలియాలి.