Blue Jounralism GayTe Website.. రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకు వస్తారు.? డబ్బు సంపాదించడానికే.! ఇది చాలామంది రాజకీయ నాయకులు ఒప్పుకోవాల్సిన మాటే.!
ఫక్తు రాజకీయ నాయకుల వ్యవహారం వేరు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పరిస్థితి వేరు.
అన్నయ్య చిరంజీవి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం, రాజకీయాల్లో మార్పు కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు.
టిక్కెట్లు అమ్ముకుంటున్నది ఎవరు.?
ఏ నియోజకవర్గానికి టిక్కెట్ రేటు ఎంత పలుకుతుందో స్థానిక ప్రజానీకానికే బాగా తెలుసు. ఎన్నికల సమయంలో ఏ నాయకుడు ఎంతలా ఓట్లను కొనుగోలు చేస్తున్నాడో జనానికి అన్నీ తెలుసు.!
మీడియా ముసుగులో మాఫియా రాజ్యమేలుతున్నమాట వాస్తవం. ఆ మాఫియా పుణ్యమా అని తప్పులు ఒప్పులుగానూ, ఒప్పులు తప్పులుగానూ కనిపిస్తున్నాయి.
అయినా, చిరంజీవికి సీట్లు అమ్ముకోవాల్సిన ఖర్మ ఏంటి.? పవన్ కళ్యాణ్ అయినా ఎందుకు సీట్లను అమ్ముకుంటారు.?
Blue Jounralism GayTe Website.. గే..ట్ వెబ్ సైట్.!
అదో వెబ్ సైట్.. తెలుగు నేలపై మొలిచిన విషపు మొక్క.. అనడం సబబేమో.! అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద విషం చిమ్మింది. ఇప్పుడు జనసేన మీద విషం చిమ్ముతోంది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి టిక్కెట్లు అమ్ముకున్నారని రాసిన విషపు రాతనే, కాస్త అటూ ఇటూగా మార్చి, జనసేన మీద ప్రయోగిస్తోంది ఆ గే..ట్ వెబ్ సైట్.!
అధికార నీలి పార్టీ నుంచి సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రజా ధనాన్ని ప్రకటనల రూపంలో బొక్కేస్తున్న సదరు నీలి గే..ట్. వెబ్ సైట్ నుంచి ఇంతకన్నా కొత్తగా ఇంకేం ఆశించగలం.?
టీడీపీ నుంచి పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్ల సంఖ్య 24. ఇందులో ఎన్ని సీట్లను జనసేన అమ్ముకోగలదు.? కాస్తంతైనా ఇంగితం వుండాలి కదా.?
Also Read: నిన్ను చేరే దారేదీ.! సేనానీ.. జనసైనికుల ఆవేదన ఇదీ.!
అమ్ముకునే ఉద్దేశ్యం వుంటే, 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీని పోటీకి దింపి.. విచ్చలవిడిగా అమ్మేసుకోవచ్చు కదా.? పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచన చేయరు, చేయలేరు.
ఎందుకంటే, అప్పట్లో చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా రాజకీయాల్లోకి వచ్చింది ‘మార్పు’ కోసం.!
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లక్షల కోట్లు దోచేసిన బాపతు కాదు చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా.!
కుల గజ్జి నరనరానా జీర్ణించుకుపోయిన ఎడ్డితనం, ఇప్పుడు ‘గే’ట్ వెబ్ సైట్ రూపంలో మీడియా రంగంలో ఓ నీలి మాఫియాని నడుపుతోంది.!