Table of Contents
YS Jagan Tirumala Declaration.. క్రికెట్లో హిట్ వికెట్ అంటే తెలుసు కదా.? సూపర్ హిట్ అని కాదు, స్వయంకృతాపరాధంతో ఔట్ అయిపోవడం.!
వైసీపీ శ్రేణులు వేరేలా అర్థం చేసుకుంటే, చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే, వైఎస్ జగన్ ఏం చేసినా, రైటే.. అన్న భ్రమల్లో వుంటారు. అదే వైసీపీకి శాపంగా మారుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే, అన్యమతస్తులు ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందే. ఇదేమీ కష్టమైన పని కాదు.
YS Jagan Tirumala Declaration.. టీటీడీ నిబంధనల్ని ఓ ప్రజా ప్రతినిథి పాటించకపోతే ఎలా.?
టీటీడీ నిబంధనల ప్రకారం, అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి. తాము ఫలానా మతానికి చెందిన వ్యక్తులం అనీ, అయినాగానీ శ్రీవారిపై విశ్వాసం వుందనీ.. అందుకే, శ్రీవారి దర్శనానికి అనుమతినివ్వాలని కోరడమే ఆ డిక్లరేషన్.
డిక్లరేషన్ అంటే, అది దైవ దర్శనాన్ని కోరడం కిందే లెక్క.! ఎవర్ని కోరుతున్నాం.? ఆ దేవ దేవుని ‘ఆలయం’ నిర్వహణ వ్యవహారాలు చూసే టీటీడీనే కదా.!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్, గతంలో ప్రతిపక్ష నేతగానూ పని చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఇంకోసారి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న జగన్, ఆ ‘డిక్లరేషన్’ని గౌరవించకపోతే ఎలా.?
వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళుతున్నట్లు చెప్పి, చివరికి ‘డిక్లరేషన్’ వంకతో, ఆ ప్రయాణాన్ని వైఎస్ జగన్ విరమించుకున్నారు.
దైవ సంకల్పం.. దేవునితోనే ఆటలా.?
దేవుడి దర్శనం కోసం సంసిద్ధమవడమంటే, అది ఆ దేవుడి సంకల్పమే. ఇటువైపు చిత్తశుద్ధి లేనిపక్షంలో, ఇచ్చిన అనుమతిని ఆ దేవుడే రద్దు చేసినట్లుగా భావించాల్సి వుంటుంది.
‘కుంటి సాకు’ చూపేందుకు వైఎస్ జగన్ సిద్ధమైన దరిమిలా, ఆ దేవ దేవుని దర్శనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కలేదు. ఇది దైవాగ్రహంగానే భావించాల్సి వుంటుంది.
Also Read: వెట్రిమారన్‌తో తమిళంలోనే ఎందుకు ఎన్టీయార్.?
‘నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను.. బయటకు వస్తే, హిందూ మతం సహా, ఇస్లాం, సిక్కు మతాల్ని కూడా ఆచరిస్తాను’ అని చెప్పుకున్నారు వైఎస్ జగన్. ఇది అసందర్భం.
ఇంకోపక్క, ‘మాజీ ముఖ్యమంత్రినైన నాకే ఇన్ని ఆంక్షలైతే, దళితుల పరిస్థితేంటి.?’ అని ఇంకో అసందర్భ ప్రేలాపన కూడా వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చేసింది.
మామూలు హిట్ వికెట్ కాదిది..
‘హిట్ వికెట్’ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా కావాలా.? హుందాగా తిరుమలకు వెళ్ళి, డిక్లరేషన్ మీద సంతకం చేసేసి, ఆ దేవ దేవుడ్ని దర్శించుకుంటే బావుండేది కదా.?
పోనీ, అసలంటూ వెళ్ళే ఉద్దేశ్యమే లేనప్పుడు, తిరుమలకు వెళుతున్నా.. అని ప్రకటించడం దేనికి.?
చివరగా: శనివారం (సెప్టెంబర్ 28న), అన్ని దేవాలయాల్లో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారుగానీ, ఆయన ఏ దేవాలయానికీ వెళ్ళకపోవడం దేనికి సంకేతం.?
అలాగే, నీ మతం ఏంటి.? అన్న ప్రశ్నకు ‘మానవత్వం’ అన్నది అసలు సమాధానమే కాదు.!