Tamannaah Bhatia Breakup.. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిపోయిందిట.! అది కూడా, సినీ నటుడు విజయ్ వర్మతో.! తెలుగులోనూ విజయ్ వర్మ నటించాడు.
ఇటు తమన్నా, అటు విజయ్ వర్మ.. ఓ వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు.. అది వేరే సంగతి. అసలు ఇద్దరూ ఎప్పుడు ప్రేమలో పడినట్లు.? ఇప్పుడు ఇద్దరూ విడిపోయినట్లు ఎందుకు ప్రచారం జరుగుతోంది.
వయసొచ్చింది.. కాదు కాదు, వయసు మీద పడింది.! కాదు కాదు, కాస్త లేటు వయసులోనే ప్రేమాయణం షురూ అయ్యింది.! అయినా, ఇప్పుడివన్నీ సినీ రంగంలో కామన్ కదా.!
Tamannaah Bhatia Breakup.. ఎందుకు విడిపోతున్నారబ్బా.?
సరే, ప్రేమలో పడ్డారు.. దాన్ని, కొన్నాళ్ళు రహస్యంగా వుంచారు.. అంతా బాగానే వుందిగానీ, విషయం బయటపడ్డాక, కొన్నాళ్ళు అంతా సజావుగానే సాగాక, ఇప్పుడెందుకు విడిపోయినట్టు.?
ప్రేమలో పడటం ఎంత సహజమో, కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపాక విడిపోవడం కూడా అంతే సహజం. రాసుకున్నోడికి రాసుకున్నంత.. అన్నట్లుంటాయి సినీ గాసిప్పులు.

ఈ బ్రేకప్ గాసిప్పులు కూడా అలాంటివే. ప్రేమలో పడినా గాసిప్పే.. విడిపోయినా గాసిప్పే.! ప్రేమ గాసిప్పు నిజమైంది.. బ్రేకప్ గాసిప్ కూడా నిజం కాబోతోంది. నిజమైపోయిందట కూడా.
లీకులు.. పబ్లిసిటీ స్టంట్లు..
లీకులు బాబోయ్ లీకులు.! గాసిప్పులకి ఈ లీకులే ఇప్పుడు ప్రధానాధారం. అలాంటప్పుడు, ఇవి గాసిప్పులు ఎందుకవుతాయ్. అదే మరి మ్యాజిక్ అంటే.!
కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.! ఔను, ప్రేమ గాసిప్పులు పబ్లిసిటీని తెచ్చిపెడతాయి. బ్రేకప్ ప్రచారాలూ పబ్లిసిటీకి పనికొస్తాయ్.! తమన్నా – విజయ్ వర్మ విషయంలో ఇదే జరిగిందా.?

విజయ్ వర్మ – తమన్నా భాటియా.. ఇద్దరి మధ్యా ప్రేమ, బ్రేకప్.. వారి వ్యక్తిగత విషయాలు. కానీ, వాళ్ళిద్దరూ సెలబ్రిటీలు కదా.! అందుకే, ఇంత హంగామా.!
Also Read: విశ్వక్ సేన్ క్షమాపణ.! ఇకపై ‘అసభ్యత’ వుండదట.!
సినీ సెలబ్రిటీలు కాబట్టి, ఇలా చర్చించుకుంటున్నాం. మామూలుగా అయితే, చాలానే జరుగుతున్నాయ్ ఇలాంటివి సాధారణ సమాజంలో కూడా.! అంతేగా.! అంతేగా.!