Hardik Pandya Mahieka Sharma.. అరరె.! క్రికెటర్ టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్ ఫ్రెండుని పరిచయం చేసేశాడే.! ఎంతమాట.? ఇదేం పైత్యం.?
తప్పు కదా.? అలా ఎలా చేస్తాడు.? ఈ చోద్యం ఎప్పుడైనా జరిగిందా.? నాన్సెన్స్.. చాలా పెద్ద తప్పు.! ఇలా చేసి వుండకూడదు.!
ఇంటా వంటా లేని వ్యవహారాలివి.. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి. వీలైతే, ఉరి శిక్ష విధించెయ్యాలి.! అంతేనా.? ఇంకేమైనా వుందా.?
Hardik Pandya Mahieka Sharma.. స్టార్ క్రికెటర్.. ట్రెండ్ సెట్టర్..
లెజెండ్ కపిల్ దేవ్ తర్వాత, టీమిండియాకి దొరికిన ఆల్ రౌండ్ ఆణిముత్యం హార్దిక్ పాండ్యా. ఇది అందరికీ తెలిసిన విషయమే.
క్రికెటర్లు, ప్రేమలు.. ఇవీ అందరికీ తెలిసిన విషయాలే.! ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు.. మళ్ళీ పెళ్ళిలు.. ఇవన్నీ సర్వ సాధారణమైన విషయాలు.
మొన్నీమధ్యనే, చాహల్ – ధనశ్రీ.. విడిపోయారు. అంతకు ముందూ, చాలా పెళ్ళిళ్ళు జరిగాయి.. చాలా విడాకులూ చోటు చేసుకున్నాయి క్రికెటర్లకు సంబంధించి.

మరో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి తన భార్యతో నడుస్తున్న గొడవ.. గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ కోవలోనే హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషాతో కొన్నాళ్ళ క్రితమే విడాకులు తీసుకున్నాడు. మళ్ళీ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కున్నాడు.
హార్దిక్ కొత్త గర్ల్ ఫ్రెండ్ కూడా మోడల్. మహీక ఆమె పేరు. మహీకతో కలిసి వున్న ఫొటోల్నీ, వీడియోల్ని తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా.
Also Read: కోటి సంతకాల సేకరణ! ఆపై లండన్ టూర్! జగన్ వరస్ట్ ప్లానింగ్!
అంతే, వున్నపళంగా కొందరు నెటిజన్లు, హార్దిక్ పాండ్యా మాజీ భర్య నటాషా ఫ్యాన్స్ అయిపోయారు. హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేసేస్తున్నారు.
మీడియా సంగతి సరే సరి.! భారతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి జరిగిందిది.. అన్నట్లుగా హార్దిక్ పాండ్యా, తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వున్న ఫొటోలు, వీడియోల వ్యవహారంపై కథనాల్ని వండి వడ్డించేస్తోంది.
సెలబ్రిటీలు కదా.. వార్త వరకూ తప్పు కాదేమో. కానీ, పుకార్లు.. విశ్లేషణలు.. తీర్పులూ.. అన్నీ మీడియానే చేసేస్తే ఎలా.?
