Anu Emmanuel Saree Beauty.. అన్నీ కలిసొస్తే.. ఎక్కడో వుండాల్సింది. కలిసొచ్చినట్లే కలిసొచ్చి.. అదృష్టం ఆమడ దూరం పారిపోయింది అనూ ఇమ్మాన్యుయేల్ విషయంలో.
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనూ ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలూ అంతంత మాత్రమే.
కానీ, అటుపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాత వాసి’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇంకేముంది అమ్మడి దశ తిరిగిపోయిందనుకున్నారంతా.
Anu Emmanuel Saree Beauty.. అక్కడి నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది..
నిజంగానే ఆ వైబ్స్ అలా కొట్టేశాయ్ అనూ ఇమ్మాన్యుయేల్ విషయంలో. అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది.
ఎంత ఫాస్ట్‌గా ఎదిగిందో.. అంతే ఫాస్ట్‌గా డౌన్ ఫాల్ అయిపోయింది. మెగా హ్యాండ్ ఎందుకో అనూ ఇమ్మాన్యుయేల్‌కి అచ్చొచ్చినట్లు లేదు.

గ్యాప్ తీసుకుని ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ అల్లు శిరీష్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది కానీ, అదీ కలిసి రాలేదు.
అనూ ఇమ్మాన్యుయేల్ కొత్తగా సరికొత్తగా..
దాంతో రేస్‌లోవెనకబడిపోయింది. మళ్లీ పోటీ పడలేకపోయింది. అనూ చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేవు కానీ, ప్రయత్నాలైతే చేస్తోంది.
తాజాగా నెట్టింట మెరుపు తీగలా మెరిసి షాకిచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్.
Also Read: పిచ్చోడితో ఐపీఎస్ ‘సూసైడ్ ఆపరేషన్’.!
గ్రీన్ శారీలో ముక్కుకు ముక్కెరతో పద్ధతిగా ముస్తాబై కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త ప్రాజెక్ట్ అనూ చేతికి చిక్కినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
చూడాలి మరి అదేంటో.!
