Home » వార్త – వాత: ప్రియురాలి ప్రేమాగ్నికి ఆహుతైన ప్రియుడు.!

వార్త – వాత: ప్రియురాలి ప్రేమాగ్నికి ఆహుతైన ప్రియుడు.!

by hellomudra
0 comments
Tegulu Media Crime Stories

Crime News Media Creativity.. తన ప్రియుడు, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో ఓ ప్రియురాలు, తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి,

తగలబెట్టేసింది.! కానీ, పోలీసులకు ప్రియురాలు చెప్పిన కథ వేరే వుంది.!

కిరణ్ అనే వ్యక్తి, తాను ప్రేమించిన యువతి ఇంటికి పెట్రోల్ క్యాన్ తీసుకెళ్ళి, ప్రేమించకపోతే చచ్చిపోతానని బ్లాక్‌మెయిల్ చేసి, పెట్రోల్ పోసుకుని తగలబెట్టేసుకున్నాడట. ఇది ఆమె చెప్పిన కథ.

కేసు విచారణలో భాగంగా పోలీసులు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. కిరణ్ అసలు పెట్రోల్ క్యాన్ తీసుకెళ్ళలేదని పోలీసులకు ఆ వీడియోతో స్పష్టత వచ్చింది.

కిరణ్‌ని రప్పించి, అతని మీద పెట్రోల్ పోసి, నిప్పంటించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కిరణ్ తగలబడిపోతున్న వైనాన్ని, సదరు యువతి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, పైశాచికానందం పొందిందట కూడా.

ఇంటికి పిలిచి, ప్రేమగా మాట్లాడి.. కిరణ్‌ని ప్రేమ మత్తులో ముంచి, అతని కళ్ళకు గంతలు కట్టి, ఆ తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి, కాళ్ళూ చేతులూ కట్టేసిందా యువతి.

ఇదేదో, ‘శృంగారం’లో కొత్త కోణం.. అనుకున్నాడు కిరణ్. కానీ, ప్రేమ మత్తులో వున్న కిరణ్ మీద పెట్రోల్ పోసి, నిప్పంటించేసింది సదరు ప్రేమికురాలు.

దాంతో, కిరణ్ సజీవ దహనమైపోయాడు.! స్టోరీ అదిరిపోయింది కదా.! కథేంటి, కిరణ్ అనే వ్యక్తి సజీవ దహనమైపోతేనూ.! అంటారా.? అలా అనిపిస్తే, అది మీ తప్పు కాదు.!

ఈ మధ్య ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి.. వాటికి, మీడియాలో వచ్చే కథనాలు ఇంకా అందంగా వుంటున్నాయి. వార్తని, అందంగా తీర్చిదిద్దడంలో.. మీడియా ఏ స్థాయి క్రియేటివిటీని ఉపయోగిస్తోందో తెలుసు కదా.?

ఈ క్రియేటివిటీతో కూడిన వార్తలు, సభ్య సమాజంలో మరిన్ని నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయా.? అంటే, ఔననేవారూ లేకపోలేదు.

దారుణమైన విషయమేంటంటే, పొద్దున్న పేపర్ చూస్తే చాలు.. ఈ క్రైమ్ వార్తలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయ్. న్యూస్ ఛానళ్ళయితే, ప్రత్యేకంగా ‘క్రైమ్’ వార్తల కోసం స్లాట్స్ కేటాయిస్తున్నాయ్.

సోషల్ మీడియా సంగతి సరే సరి.! ఓటీటీ కంటెంట్, సినిమాలు.. వాట్ నాట్.. అన్నీ, క్రైమ్ రేట్ పెరగడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయ్.

నిజానికి, ఇలాంటి వార్తలకు ఎంత తక్కువ స్కోప్ మీడియా ఇస్తే, అంత మంచిది.! దురదృష్టవశాత్తూ, ఈ పోటీ యుగంలో.. మీడియాని క్రైమ్ వార్తల విషయమై అస్సలు నిలువరించలేం.

స్వీయ నియంత్రణను అస్సలు ఆశించలేం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group