Trisha TVK Vijay Politics.. సినీ నటి త్రిష, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తుందా.? ఈ ప్రశ్న గత కొన్నాళ్ళుగా తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది.
త్రిష మాత్రం, తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, అనవసరంగా తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేసింది.
అయినా సరే, త్రిష రాజకీయాల్లోకి రాబోతోందంటూ గాసిప్స్ మాత్రం వస్తూనే వున్నాయి. తాజాగా ఆ గాసిప్స్ మరింత ఎక్కువగా, ఈసార ఇంకాస్త కొత్తగా ప్రచారంలోకి వస్తున్నాయి.
Trisha TVK Vijay Politics.. విజయ్ గెలుపు.. త్రిష రాజకీయ మలుపు..
టీవీకే పార్టీ అధినేత విజయ్, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ గెలిచిన సంగతి తెలిసిందే.
సో, ఓ చోట నుంచి మాత్రమే విజయ్, శాసన సభకు ప్రాతినిథ్యం వహించాల్సి వుంటుంది. ఇంకో స్థానానికి రాజీనామా చేయక తప్పదు.

అలా విజయ్ రాజీనామా చేయబోయే స్థానంలో త్రిష పోటీ చేస్తుందనీ, ఆమె డిప్యూటీ సీఎం అవబోతోందంటూ తమిళ రాజకీయాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగిన రోజు.. అంటే, మే 4న త్రిష పుట్టినరోజు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళింది త్రిష.
స్నేహితులు మాత్రమే కాదు.. అంతకు మించి..
విజయ్, త్రిష.. ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కాదు, త్వరలో ఇద్దరూ పెళ్ళి చేసుకోబుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
తన భార్యతో విడాకుల వ్యవహారానికి సంబంధించి విజయ్, కోర్టు బయట సెటిల్మెంట్ కూడా చేసుకుంటున్నారు.. ఇదంతా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడిచిన వ్యవహారమే.
విడాకులు మంజూరవడమే ఆలస్యం, విజయ్ – త్రిష పెళ్ళి చేసుకుంటారనే చర్చ తమిళ రాజకీయాల్లో చాలా చాలా బలంగా వినిపిస్తోంది.
Also Read: అప్పుడు ఫ్లాప్ ఇప్పుడేమో ట్రెండ్ సెట్టర్!
ఇదిలా వుంటే, అసెంబ్లీకి కాదు.. త్రిష రాజ్యసభకు వెళుతుంది, కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో టీవీకే తరఫున చక్రం తిప్పుతుందన్న ఇంకో వాదన తెరపైకొచ్చింది.
బీజపీతో టీవీకే విజయ్ కలిస్తేనే, ఈ ముచ్చటకు ఆస్కారముంది. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు మరి. ఇంతకీ, ఈ గాసిప్పులపై త్రిష ఏమంటుందో.!
