Table of Contents
Pawan Kalyan Telangana JSP.. తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లను నిషేధిస్తూ, ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించేశారు తెలంగాణలో ఓ మంత్రి.
పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయం చేసుకోవాలి తప్ప, తెలంగాణలో తన రాజకీయ పార్టీని నడపకూడదని తెగేసి చెబుతాడు ఇంకో తెలంగాణ మంత్రి.
పళ్ళు రాలతాయ్.. అని ఓ రాజకీయ పార్టీ అధినేత్రి, తెలంగాణేతర రాజకీయ నాయకులు, పార్టీలకు అల్టిమేటం జారీ చేసేస్తారు.
తరిమి కొడతాం.. అంటాడొకడు.! అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకెన్నాళ్ళీ, ప్రాంతీయ సరిహద్దుల కంచెలు తెలంగాణ రాష్ట్రానికి.?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమించారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
Pawan Kalyan Telangana JSP.. తెలంగాణలోనూ అమలయ్యేది భారత రాజ్యాంగమే..
దేశంలో వున్న చాలా రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణలోనూ, భారత రాజ్యాంగమే అమలవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు.
అంతెందుకు, విదేశీయురాలైన సోనియా గాంధీ, ఇక్కడ మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు. కాంగ్రెస్ అధినేత్రిగా, ఎంపీగా.. ఆమె పలు బాధ్యతలు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు.
విదేశీ వనితకి భారత దేశంలో లేని ఆంక్షలు, తెలుగు నేలపై.. తెలుగు వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్‌కి, తెలంగాణలో ఆంక్షలు ఎందుకు.?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కలిసే వున్నారు. కలిసే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు.. కుటుంబ సంబంధాలూ కలుపుకుంటున్నారు.
ప్రజల మధ్యన ‘ప్రాంతీయ’ ఇనుప కంచెలు నిర్మిస్తారా.?
మధ్యలో ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఎవరసలు, ప్రాంతీయ సరిహద్దుల పేరుతో, ప్రజల మధ్య రాజకీయంగా ఇనుప కంచెలు నిర్మించడానికి.?
కుహనా మేథావులు, ఎర్నలిస్టులు.. ఇలా అందరిదీ ఒకటే తీరు. సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని మించి ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మీద.
జన సేన పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద. దాన్ని ఆదరించడం, ఆదరించకపోవడం అది ప్రజలకు సంబంధించిన వ్యవహారం.
ప్రజా తీర్పుని ఏ రాజకీయ పార్టీ అయినా సరే గౌరవించాల్సిందే. ఇంకాస్త బలంగా, ప్రజల్ని మెప్పించేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది.. అదే జన సేన కూడా చేస్తోంది.
కుహనా మేథావుల ఆందోలన అర్థ రహితం..
గతంలో, తెలంగాణ ఎన్నికల్లో జన సేన పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా గెలుచుకుంది. ప్రజల్లో లేని విద్వేషం, సోకాల్డ్ కుహనా మేధావులకి ఎందుకు.?
ఎందుకంటే, అభద్రతా భావం.. తమ ఉనికికి ముప్పు ఏర్పడుతుందనే భయం.! విద్వేషం తప్ప, కనీసపాటి సంస్కారం, సంయమనం లేనివాళ్ళు సమాజానికి అత్యంత హానికరం.
ఔను, తెలంగాణలో కూడా భారత రాజ్యాంగమే అమలవుతోంది. కాదని ఎవరైనా అంటే, దేశ ద్రోహులుగానే వాళ్లని పరిగణించాల్సి వస్తుంది.
ఒక్కటి మాత్రం నిజం.. జన సేన పార్టీని అడ్డుకోవాలనే కుట్రలు, పరోక్షంగా జన సేన పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడతాయ్.. ఈ విషయాన్ని కుహనా మేథావులు గుర్తెరగాలి.
తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే గులాబీ పార్టీ, జాతీయ పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరులోని తెలంగాణని తీసేసి, ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చారు కేసీయార్.
ఆంధ్ర ప్రదేశ్‌లోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీయార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీయార్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌కి విస్తరించొచ్చు.. తెలంగాణలో పుట్టిన జన సేన, తెలంగాణలో విస్తరించకూడదా.?
