Table of Contents
Pet Animal Tortoise.. తాబేలు అంటే, శ్రీమహావిష్ణువు అని భావిస్తుంది సనాతన భారతీయ హిందూ సమాజం.! ఔను, శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో, దర్శనమిస్తుంటారు.. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో.
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గ్రామంలోని పురాతన దేవాలయంలో శ్రీమహావిష్ణువిని కూర్మావతారంలో దర్శించుకుంటారు భక్తులు.
మరి, అలాంటి కూర్మాన్ని ఇంట్లో పెంచుకుంటే మంచిదేనా.? ఎందుకు మంచిది కాదు, చాలా మంచిది.. శుభాలు కలుగుతాయ్.. అని, ఇళ్ళలో కూర్మాల్ని పెంచుకునేవారి సంఖ్య ఎక్కువైంది.
గతంలో, ఇళ్ళల్లో బావులుండేవి.. వాటిల్లో కూర్మాలు పెరిగేవి. చెరువుల్లోనూ తాబేళ్ళు వుండేవి. సముద్ర తీరాల్లో పెద్ద పెద్ద తాబేళ్ళ సంగతి సరే సరి.
Pet Animal Tortoise.. తాబేళ్ళకు మానవాళి నుంచి ఎదురవుతున్న సవాళ్ళు..
అయితే, గత కొంతకాలంగా తాబేళ్ళ అక్రమ రవాణా పెరిగిపోయిన దరిమిలా, తాబేళ్ళు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే, తాబేళ్ళ సంరక్షణకి ప్రభుత్వాలు నడుం బిగించాయి. కొన్ని రకాల తాబేళ్ళను ఇళ్ళల్లో పెంచుకోవడంపైనా నిషేధాజ్ఞలున్నాయి.
అయినాగానీ, తాబేళ్ళ అక్రమ రవాణా జరుగుతూనే వుంది. ఎప్పటికప్పుడు, ఈ తాబేళ్ళ అక్రమ రవాణా గుట్టుని రట్టు చేస్తున్నారు అధికారులు తనిఖీల ద్వారా.
మరి, ఇళ్ళల్లో తాబేళ్ళను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది కదా.? అంటే, దానికి కూడా ఓ మార్గముంది. ప్రత్యేక అనుమతులు తీసుకుని కొందరు పెంచుకుంటున్నారు.
ఇళ్ళల్లో పెంచుకోవడం నయా ట్రెండ్..
కొందరు, నిషేధం లేని రకాలైన తాబేళ్ళను ఇళ్ళల్లో పెంచుకోవడం చూస్తున్నాం. మరోపక్క దేవాలయాల ప్రాంగణాల్లో తాబేళ్ళ సంరక్షణా కేంద్రాల్ని నిర్వహిస్తుండడం గమనార్హం.
సముద్ర తాబేళ్ళు వేరు, మంచి నీటి తాబేళ్ళు వేరు.. అవీ, ఇవీ.. రెండూ అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
తాబేళ్ళ మీద గట్టిగా వుండే ‘షెల్’ కోసం, ఎక్కువగా వీటిని వేటాడుతున్నారు.. తాబేళ్ళ అక్రమ వ్యాపారంలో ఇదే అత్యంత కీలకమైనది.
నిజమే, తాబేలు ఇంట్లో వుంటే మంచిది. అలాగని హిందూ పండితులు చెబుతున్నారు. అయితే, అవి సహజ వాతావరణంలో పెరగాలి.. వాటిని, బంధించడం అస్సలేమాత్రం మంచిది కాదు.
తాబేలు ప్రతిమలతో ఇంటికి మేలు.?
గాజుతోనూ, వివిధ రకాలైన లోహాలతోనూ తయారు చేసిన తాబేళ్ళ ప్రతిమల్ని ఇంట్లో వుంచుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని నమ్ముతారు చాలామంది.
అలానే, చేతికి ఉంగరాల రూపంలో, ఇతర రకాలైన ఆభరణాల్ని తాబేలు ఆకారంలో తయారు చేయించుకుని ధరించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం.
కొన్ని రకాలైన తాబేళ్ళు వందల ఏళ్ళు జీవిస్తాయి. భారీ ఆకారంలో దర్శనమిస్తాయవి. ఇంట్లోని చిన్న చిన్న అక్వేరియంలలో పెంచేందుకు తాబేళ్ళు లభిస్తున్నాయిప్పుడు.
చట్ట పరంగా ఇబ్బందులు లేకుండా, ఇళ్ళలోని అక్వేరియంలలో అలాంటి తాబేళ్ళను నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు.
కూర్మము.. తాబేలు.. పేరేదైనా, శ్రీ మహా విష్ణువు రూపమేనని నమ్ముతున్నాం కదా.! వాటికి హాని కలిగించకుండా వుందాం. సంరక్షిద్దాం.
పూజించకపోయినా ఫర్లేదు, ‘మంచి జరుగుతుంది కాబట్టి’ వాటి స్వేచ్చని హరించకూడదు. మన ఆనందం కోసం వాటిని హింసించడం మానేద్దాం.!
