Home » సాయి ధరమ్ తేజ్: మళ్ళీ జన్మించా.! తొంభై శాతం కోలుకున్నా.!

సాయి ధరమ్ తేజ్: మళ్ళీ జన్మించా.! తొంభై శాతం కోలుకున్నా.!

by Mudra369 Editorial Desk
0 comments
Sai Dharam Tej

Sai Dharam Tej Rebirth.. సరిగ్గా ఐదేళ్ళ క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ మీద వెళుతూ, ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు మీద పడిపోయి వుండడాన్ని అటుగా వెళుతున్న కొందరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సకాలంలో వైద్య చికిత్స అందడంతో, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు సాయి ధరమ్ తేజ్.

పలు సర్జరీలు జరిగాయి సాయి ధరమ్ తేజ్‌కి.! కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ‘రిపబ్లిక్’ సినిమా విడుదల సమయంలో జరిగిందీ ఘటన.

కాస్త కోలుకున్నాక ‘విరూపాక్ష’లో నటించాడు. ‘బ్రో’ సినిమా కూడా చేశాడు. అయితే, పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది సాయి ధరమ్ తేజ్ నుంచి.

ఫిట్‌గానే కనిపిస్తున్నాడు కదా.? అంటే, కాదు.. 90 శాతమే కోలుకున్నానంటూ సంచలన ప్రకటన చేశాడు సాయి ధరమ్ తేజ్.!

ఐదేళ్ళ తర్వాత.. రీ-బర్త్ పోస్ట్..

‘రీబర్త్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సాయి ధరమ్ తేజ్, 100 శాతం కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పాడు.

స్పీచ్ విషయమై సాయి ధరమ్ తేజ్ ఇంకా తడబడుతూనే వున్న సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ షాక్ నేపథ్యంలో, గొంతు సమస్య ఏర్పడింది ఆయనకి.

‘హెల్మెట్ ధరించండి’ అంటూ, తన ఎమోషనల్ పోస్ట్‌ని ముగించాడు సాయి ధరమ్ తేజ్. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపాడు.

మరోపక్క, ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు మీద పడిపోయిన సాయి ధరమ్ తేజ్‌కి సాయం చేసిన వ్యక్తులకు తగిన సాయం అందలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

Also Read: పెట్టుకున్న పేరు చిరంజీవి.! ప్రేమతో దక్కిన శాశ్వత గుర్తింపు.!

తనను ట్రోల్ చేస్తున్నవారికి, సమాధానమిచ్చాడు సాయి ధరమ్ తేజ్. తనకు సాయం చేసిన వారికి, తాను తిరిగి సాయం చేశాననీ, సాయాన్ని తానెప్పటికీ మర్చిపోననీ, సంబంధిత ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశాడు.

ఇదిలా వుంటే, సంబరాల ఏటి గట్టు సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ చాలా చాలా కష్టపడ్డాడు ఫిజిక్ పరంగా. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, ‘విరూపాక్ష’ సినిమాలో కొంత ఇబ్బందిగానే కదిలాడు.

‘బ్రో’ సినిమాకి మాత్రం, కాస్త బెటరయ్యాడు. అయినా, డాన్స్‌లు వేయడానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాకి వచ్చే సరికి, ఫిజిక్‌ని పూర్తిగా మార్చేసుకున్నాడు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group