Idupu Kayitham Kavitha TRS.. ‘ఇడుపు కాయితం’ అనగా, విడాకులకు సంబంధించి తెలంగాణలో ఓ మాట వుంది.
భార్యాభర్తలుగా కలిసి వుండలేక, విడిపోవాలనుకున్నప్పుడు, కుటుంబ సభ్యులు అలానే బంధు మిత్రుల సమక్షంలో రాసుకునే ‘విడాకుల కాగితమే’ ఈ ఇడుపు కాయితం.
ఇదే, ఈ ‘ఇడుపు కాయితం’ అనే మాటనే టైటిల్‌గా పెట్టి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా, ఈ ‘ఇడుపు కాయితం’పై చిత్ర విచిత్రమైన చర్చ జరుగుతోంది.
తెలంగాణ భాష.. తెలుగు భాష.. ఆంధ్ర భాష.. అంటూ, మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి.
సందట్లో సడేమియా, కొందరు రాజకీయ నాయకులు.. ఈ మంటల్లో చలికాచుకుంటున్నారు. ఆ లిస్టులో తాజాగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత కూడా వచ్చి చేరారు.
వాస్తవానికి, సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపిన వ్యక్తులు, వాళ్ళు అభిమానిస్తున్న రాజకీయ పార్టీ వేరు.. కవిత, టార్గెట్ చేసింది వేరు.!
అనూహ్యంగా కవిత, ‘ఇడుపు కాయితం’ అంటే, ఆ మాటకి అర్థం పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు.. అంటూ, జన సేన పార్టీని కెలికారు.
గత కొన్నాళ్ళుగా సీరియస్ పొలిటీషియన్ కవిత, సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు జన సేన విషయంలో. నిజానికి, అవన్నీ అసందర్భ ప్రేలాపనలే.
ఈ ఇడుపు కాయితం వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ మీద కవిత అసందర్భంగానే ప్రేలాపనలు పేలారు. దాంతో, సహజంగానే జన సేన పార్టీ గుస్సా అయ్యింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని, తీహార్ జైలుకు వెళ్ళిన కవిత, ‘ఇడుపు కాయితం’ అనబడే బెయిల్ మీదనే విడుదలయ్యారన్న విషయాన్ని మర్చిపోతే ఎలాగంటూ జన సేన పార్టీ ప్రశ్నిస్తోంది.
అదీ నిజమే కదా.! ఇడుపు కాయితం.. అంటే, బెయిల్ అనే అర్థం కూడా వస్తుంది మరి.!
అసలు పవన్ కళ్యాణ్‌కి ఏ సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కవిత ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు.?
ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే, తద్వారా జరిగే ట్రోలింగుతో తెలంగాణ సమాజంలో సింపతీ వస్తుందన్నది కవిత వ్యూహం.
సింపతీ రావడం లేదు సరికదా, కవితకి తెలంగాణలో ఛీత్కారాలు ఎక్కువైపోయాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేసిన జగన్, ఆంధ్ర ప్రదేశ్ నుంచి పారిపోయి, బెంగళూరులో దాక్కోవాల్సి వస్తోంది.
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేస్తే, కర్మ వదిలిపెట్టదు.! పైగా, ‘ఇడుపు కాయితం’పై వ్యక్తిగత కామెంట్లు.. అత్యంత జుగుప్సాకరం.
