Home » ముద్రాభిప్రాయమ్: టీడీపీ, జన సేన.. పరస్పర గౌరవం ఇలాగేనా.?

ముద్రాభిప్రాయమ్: టీడీపీ, జన సేన.. పరస్పర గౌరవం ఇలాగేనా.?

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan Chandrababu

TDP Janasena Mutual Respect.. జన సేన కార్యకర్తల ముసుగులో టీడీపీపైనా, టీడీపీ కార్యకర్తల ముసుగులో జన సేన పార్టీ పైనా.. విమర్శలు, నిందారోపణలు, సోషల్ మీడియా ట్రోలింగ్.. చూస్తూనే వున్నాం.

ఇదే విషయమై ఇటు జన సేన అటు టీడీపీ.. అధికారికంగా తమ తమ పార్టీల కార్యకర్తలకి స్పష్టమైన సూచనలు చేశాయి. ఇరు పార్టీల మధ్యా సఖ్యత అవసరమని రెండు పార్టీలూ ఆకాంక్షించాయి.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అలానే మంత్రి నారాలోకేష్.. ఇంకో వైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్.. తమ తమ కార్యకర్తలు సంయమనం పాటించాలని తరచూ విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజకీయమంటేనే విమర్శల పర్వం. 2024 ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అయినాగానీ, మూడు పార్టీల మధ్య గ్రౌండ్ లెవల్‌లో ఇంకా కొంత ‘గ్యాప్’ వుంది.

ఓ రాజకీయ పార్టీలోనే అంతర్గతంగా చాలా విబేధాలు వుండొచ్చు. అలాంటిది, మూడు పార్టీల కార్యకర్తల మధ్య ‘గ్యాప్’ లేకుండా ఎలా వుంటుంది.?

అయినాగానీ, ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అవకూడదన్నది కూటమి పార్టీల్లో.. అందునా టీడీపీ, జనసేన అధినాయకత్వాల ఆలోచన.

TDP Janasena Mutual Respect.. ఇంకోసారి.. మళ్లొకసారి.. అయినా తీరు మారట్లేదు..

ఈ క్రమంలోనే తాజాగా, ఇంకోసారి తమ తమ పార్టీల కార్యకర్తలకు ‘సుద్దులు’ చెబుతూ, అటు టీడీపీ, ఇటు జన సేన.. సోషల్ మీడియా వేదికగా ఓ సూచన చేయడం జరిగింది.

ఇక్కడితో అన్ని వివాదాలూ సమసిపోతాయా.? అంటే, ఛాన్సే లేదు.! స్థానిక ఎన్నికలొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో గడబిడ కొంత ఎక్కువవుతుంది.

సీట్లు దక్కనివారు, కూటమి ఐక్యతను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. అది కూటమి గెలుపుపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించకూడదంటే, చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలిసి కూర్చుని మాట్లాడి, కీలక నిర్ణయం తీసుకోవాలి.

మరోపక్క, ఎన్టీయార్‌పై జన సేన కార్యకర్తలు అలానే చిరంజీవిపై టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ముగింపు పలకడంపైనా ఇరు పార్టీల అధినాయకత్వం తగిన చర్యలు చేపట్టాల్సి వుంది.

తాజాగా టీడీపీ, జనసేన తమ శ్రేణులకు చేసిన విజ్ఞప్తిలో చిరంజీవి, ఎన్టీయార్ పేర్ల ప్రస్తావన రావడం గమనార్హం. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఎన్టీయార్ జీవించి లేరు.

ఎన్టీయార్ అంటే, టీడీపీ వ్యవస్థపకుడు. చిరంజీవికి జన సేన పార్టీలో అసలు సభ్యత్వమే లేదు. కొందదరు టీడీపీ కార్యకర్తలు, చిరంజీవిని కాంగ్రెస్ నేతగా చూస్తారు.

మరోపక్క, ఎన్టీయార్‌ని టీడీపీ నుంచి గతంలో వెలివేసిన విషయాన్ని జన సైనికులు ప్రస్తావిస్తారు. కౌంటర్ ఎటాక్‌లో భాగంగానే ఇదంతా జరిగేది.

సో, ‘గిల్లుడు’ ఆగితేనే, ఈ ట్రోలింగ్ ఆగుతుంది. ఆ కొందరు రెచ్చిపోవడం, కూటమికి ఇబ్బందికరంగా మారుతుంది. కానీ, ఆ కొందరి గిల్లుడిని ఆపడమే ఎలా.? పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?

Also Read: ‘రోమాంచకం’ మూవీ రివ్యూ: హాస్యాంచకం ఫర్లేదంతే.!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అండర్‌స్టాండింగ్‌తో వున్నా.. కార్యకర్తల స్థాయిలో జరిగే చిన్నపాటి అలజడి రెండు పార్టీలకూ చికాకుగా మారుతోంది.

ఎన్టీయార్‌ని జనసేన కార్యకర్తలు తిడుతున్నారని టీడీపీ అధికారికంగా చెప్పకూడదు. అలానే, చిరంజీవిని టీడీపీ కార్యకర్తలు తిడుతున్నారని జన సేన అధికారికంగా చెప్పిానా అదీ తప్పే అవుతుంది.

ఒకర్ని ఒకరు నిందించుకోవడమంటే, కలహాల కాపురం.. అనే సంకేతాల్ని టీడీపీ, జన సేన.. ఉమ్మడిగా జనంలోకి పంపుతున్నట్లే అర్థం. పరస్పర గౌరవం అంటే ఇది కాదేమో.!

టీడీపీ, జన సేన కార్యకర్తల ముసుగులో.. అని మాత్రమే పేర్కొని, పార్టీల అంరత్గతంగా తమ తమ కార్యకర్తల్ని వారించుకోవాలి.. అవసరమైన వారిపై కఠిన చర్యలూ తీసుకోవాలి.

– yeSBee

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group