Home » ‘ఇరుముడి’ నేర్పిన పాఠం.! టాలీవుడ్ నేర్చుకోవాలా గుణపాఠం.?

‘ఇరుముడి’ నేర్పిన పాఠం.! టాలీవుడ్ నేర్చుకోవాలా గుణపాఠం.?

by Mudra369 Editorial Desk
0 comments
Raviteja Irumudi Nakshathra

Irumudi Lesson For Tollywood.. తెలుగు సినీ పరిశ్రమలో ఏడాదికి వచ్చే సినిమాల సంఖ్యకీ, హిట్టయ్యే సినిమాలకీ చాలా తేడా వుంటుంది. ఫ్లాపులు చాలా ఎక్కువ.. హిట్లు చాలా తక్కువ.!

సినిమా అంటే వ్యాపారం.! ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు.? నష్టాలు కొనితెచ్చుకోవడానికైతే కాదు కదా.! లాభాల కోసమే, కాంబినేషన్లు.!

కథ, కాకరకాయ్.. ఇవన్నీ తర్వాత, ముందు హీరో మార్కెట్ ఎంత.? కాంబినేషన్ క్రేజ్ ఎంత.? ఇలాంటి లెక్కలు ఇప్పటివి కాదు.. ఎప్పటినుంచో నడుస్తున్న ఈక్వేషన్లే ఇవి.

రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినిమా 200 కోట్ల క్లబ్బులోకి అవలీలగా చేరిపోయింది.

దాంతో, ఈ సినిమా హిట్టు నేపథ్యంలో ‘తెలుగు సినిమా కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణమిదే..’ అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి.

ముందే చెప్పుకున్నాం కదా.. తెలుగు సినిమా చాలానే చూసింది.. చూస్తోంది.. ఇంకా చాలా చూడబోతోంది కూడా.! ఇదొక నిరంతర ప్రవాహం.!

Irumudi Lesson For Tollywood.. మూకీ నుంచి డాల్బీ వరకూ..

మూకీ సినిమాల నుంచి డాల్బీ ఫార్మాట్ సినిమాల వరకూ ఎదిగింది తెలుగు సినిమా. 35 ఎంఎం సినిమాలు.. 70 ఎంఎం సినిమాలు.. అంతకు మించి.. చాలా చూసింది.. చాలా చాలా చూడబోతోంది.

నటనలో మార్పులొచ్చాయ్.. సంగీతంలో మార్పులొచ్చాయ్.. దర్శకత్వంలోనూ మార్పులొచ్చాయ్.. బడ్జెట్ సంగతి సరే సరి.!

‘ఇరుముడి’ సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు.. చాలా పెద్ద హిట్టయ్యింది. దాంతో, సహజంగానే లాభాలు ఎక్కువ వచ్చాయ్.

అదే రవితేజ, తన అనుభవాన్నంతా రంగరించి చేసిన సినిమాలు బెడిసి కొట్టాయ్. ‘ఇరుముడి’ ఘన విజయం సాధించింది. కావాలని రవితేజ, ఫ్లాప్ కథల్ని ఎంచుకోడు కదా.!

ఒక్కటి మాత్రం నిజం.. ‘ఇరుముడి’ తర్వాత, తెలుగు సినిమా ఆలోచనలు కొంత మారాలి. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటి సినిమాలూ అవసరమేనని తెలుసుకోవాలి.

‘ఆనంద్’ సినిమా రిలీజయినప్పుడూ ఇదే చర్చ.! చిన్న సినిమాల నుంచి ‘బాహుబలి’ వరకూ ఎదిగాం. ప్యాన్ ఇండియా సినిమా.. అంటున్నాం. అదీ, ఇదీ.. అన్నీ వుండాలి.

సినిమా స్కేల్ అలా అలా మారుతుంటుంది..

సినిమా స్కేల్.. అనేది, కథ పేపర్ మీద పడ్డాక మారుతూ వుంటుంది. కాంబినేషన్లను అనుసరించి, బడ్జెట్ సమీకరణాలు మారతాయ్.

మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం.. ఇదొక నిరంతర ప్రక్రియ.! హిట్లుంటాయ్.. ఫ్లాపులుంటాయ్.. డిజాస్టర్లుంటాయ్.. ఇండస్ట్రీ రికార్డులూ వుంటాయ్.

హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఎక్కువ వచ్చి, ఫ్లాపులు తగ్గాలని మాత్రమే కోరుకుందాం.! పాఠాలు, గుణపాఠాలూ ఏమీ వుండవిక్కడ.

ఒక్కోసారి ఈక్వేషన్స్ సెట్ అవవు. ఒక్కోసారి అనూహ్యంగా లెక్కలు వర్కవుట్ అవుతాయ్. చిన్న సినిమాలూ రావాలి.. పెద్ద సినిమాలూ రావాలి. తెలుగు సినిమా కళకళ్ళాడాలి.

నిజానికి, ‘ఇరుముడి’ సినిమాకి ఎక్కడా నెగెటివిటీ కనిపించలేదు. పోటీపడి మరీ, పాజిటివ్ రివ్యూలు వచ్చాయ్. అన్ని సినిమాలకీ ఇదే పరిస్థితి వుండాలి.

బాగోలేని సినిమాకి విమర్శ వేరు.. నెగెటివ్ ట్రోలింగ్ వేరు. ఆ నెగెటివ్ ట్రోలింగ్ తగ్గాలి. ఈ ట్రోలింగ్ ప్రాసెస్‌లో లీకులూ తగ్గాలి.

లీకులంటే, ముఖ్యమైన సన్నివేశాల్ని అత్యుత్సాహంతో పోస్ట్ చేయడం కూడా. సినిమా రిలీజ్ రోజున, మొత్తం సినిమాని బిట్లు బిట్లుగా సోషల్ మీడియాలో వదిలెయ్యడమూ తగ్గాలి.

సినిమా అంటే, అందరి సమిష్టి కృషి.

– yeSBee

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group