Apple iPhone18 Series.. మార్కెట్లో వాడికున్న క్రేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది.. అంటూ ఓ సినిమాలో డైలాగొకటి వుంటుంది.!
యాపిల్ ఐ ఫోన్ అంటే, నిజంగానే మార్కెట్‌లో అంతకు మించిన క్రేజ్ వుంటుంది.! క్రేజ్ అనాలా.? పిచ్చి అనాలా.? ఇంకేమన్నా అనాలా.?
కేవలం యాపిల్ ఐ ఫోన్ కోసమే, కిడ్నీలు అమ్ముకున్న సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలా కనిపిస్తాయ్. అంత ఖరీదైన మొబైల్ ఫోన్స్ ‘యాపిల్’ నుంచి వస్తుంటాయ్.
ఓన్లీ యాపిల్ ఐ ఫోన్ మాత్రమే అంత ఖరీదైనదా.? అంటే, శాంసంగ్ సహా పలు ఇతర మొబైల్ తయారీ సంస్థలు కూడా అత్యంత ఖరీదైన ఫోన్లను మార్కెట్‌లోకి దింపుతుంటాయ్.
అయినాసరే, ‘యాపిల్ ఐ ఫోన్’కి వున్న క్రేజ్ వేరే లెవల్ అంతే.! తాజాగా, మార్కెట్‌లోకి ‘యాపిల్ ఐ ఫోన్ 18 సిరీస్’ వచ్చేసింది.!
Apple iPhone18 Series.. రేటు.. యాపిల్ ఐ ఫోన్ 18 మహా ఘాటు.!
అంతా ఊహించినట్లుగానే, ఫీచర్స్ అదిరిపోయాయ్. రేట్లు అయితే, షరామామూలుగానే ‘అంతకు మించి’. మూడు లక్షల వరకు ధర పలుకుతోంది ఓ మోడల్.
మూడు లక్షలు కాదు, నాలుగు లక్షల పైనే.. అంటూ, ‘యాపిల్ ఐ ఫోన్ 18 సిరీస్’లో ఓ మోడల్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈసారి ‘యాపిల్ ఐ ఫోన్’ నుంచి ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లు కూడా వచ్చాయి. యాపిల్ ఐ ఫోన్ డ్యూ దాని పేరు. ధర అక్షరాలా నాలుగున్నర లక్షలట. ఏకంగా ఓ కారు బేస్ మోడల్ వచ్చేస్తుంది ఈ ధరకి.

అయితే, ఈ తరహా ఫోల్డబుల్ మోడళ్ళు, మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో వున్నాయి.. కాకపోతే, వేరే బ్రాండ్లవి.
తెలుసు కదా.. ‘యాపిల్ ఐ ఫోన్’కి వున్న సెపరేట్ ఫ్యాన్ బేస్ గురించి.! ఆల్రెడీ ఎంక్వయిరీలు మొదలైపోయాయ్. స్టోర్లలో ఫోన్లు అందుబాటులోకి వస్తే, జాతరని తలపిస్తాయ్ ఆ స్టోర్లు.
ఎందుకింత ఖరీదు.?
మిగతా బ్రాండ్లలోనూ దాదాపు ఇవే ఫీచర్స్ అందుబాటులో వున్నాసరే, ‘యాపిల్ ఐ ఫోన్’ అనే బ్రాండ్‌కి వున్న రేంజ్ వేరు. దాన్నొక, సోషల్ స్టేటస్‌గా చూస్తుంటారు చాలామంది.
మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు, ‘యాపిల్ ఐ ఫోన్’ వాడకాన్ని ‘పరువు ప్రతిష్టల’ అంశంగా చూస్తారు. వాళ్ళని అనుకరించే అభిమానుల సంగతి సరే సరి.
క్వాలిటీ విషయమై గత కొంతకాలంగా ‘యాపిల్ ఐ ఫోన్’ కొన్ని విమర్శల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇతర సంస్థల మొబైల్ ఫోన్ల క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తోందనుకోండి.. అది వేరే సంగతి.
ఏది ఏమైనా కొద్దిరోజుల్లోనే భారత దేశంలో ‘ఐ ఫోన్ 18 సిరీస్’ ఫోన్ల జాతరలో మనమంతా మునిగి తేలబోతున్నాం.
Also Read: ముద్రాభిప్రాయమ్: టీడీపీ, జన సేన.. పరస్పర గౌరవం ఇలాగేనా.?
అన్నట్టు, కొత్త మోడల్ వచ్చాక సహజంగా పాత మోడల్ ధర తగ్గుతుంది. అయితే, ‘యాపిల్ ఐ ఫోన్ 17’ ధరని అమాంతం పెంచేశారు. 20 శాతం, ఆ పైన ధరలు పెరగడం గమనార్హం.
దాంతో, కొత్త మోడల్ ఫోన్ ఎలాగూ కొనలేం.. పాత మోడల్ ఫోన్ కూడా కొనలేకపోతున్నాం.. అని ‘యాపిల్ ఐ ఫోన్’ అభిమానులు గుస్సా అవుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా, దాదాపు అన్ని మోడళ్ళ ధరలూ గణనీయంగా పెరిగిపోయాయ్ ఇటీవలి కాలంలో.
