Home » పెళ్ళెందుకు చేసుకోవాలి.? ఎవరి కోసం చేసుకోవాలి పెళ్ళి.?

పెళ్ళెందుకు చేసుకోవాలి.? ఎవరి కోసం చేసుకోవాలి పెళ్ళి.?

by Mudra369 Editorial Desk
0 comments
Anjali

Anjali Marriage Rumors Again.. సినీ నటి అంజలి వయసెంత.? అబ్బే, ఆడవాళ్ళ వయసు గురించీ, మగవాడి సంపాదన గురించీ.. అడక్కూడదండీ.. పెద్దలు చెప్పారు కదా.! అంటే, అది వేరే చర్చ.

ఇది సోషల్ మీడియా యుగం.! పైగా, ఆర్టిఫీషీయల్ ఇంటెలిజెన్స్ యుగం.! ఇలా కొడితే, అలా డిటెయిల్స్ వచ్చేస్తున్నాయి. సమాచారం తప్పా.? ఒప్పా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.

అసలిప్పుడు అంజలి వయసు గురించిన ముచ్చటెందుకు.? అంటే, వికీపీడియా పరంగా చూస్తే, నలభై ఏళ్ళట అంజలి వయసు.!

అంజలి తొలి తెలుగు సినిమా ‘ఫొటో’.! దాదాపు ఇరవయ్యేళ్ళ క్రిందట వచ్చింది ఆ సినిమా. పోనీ, అప్పటికి అంజలికి పదహారేళ్ళే అనుకున్నా, ఇప్పుడామెకి ముప్ఫయ్ ఆరేళ్ళన్నమాట.

ఇప్పుడీ వయసుకు సంబంధించిన చర్చ ఎందుకంటే, పెళ్ళి గురించిన గాసిప్స్ వస్తున్నాయి కాబట్టి. అంజలి గతంలో ఓ తమిళ హీరోతో డేటింగ్ చేసిందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అది బ్రేకప్ అయ్యింది.

ఇంకో తమిళ హీరోతో సహజీవనం.. అంటూ గాసిప్స్ వినిపించాయి. ఆ ముచ్చట కూడా తీరిపోయింది.! గత కొంతకాలంగా సింగిల్‌గానే వుంటోంది అంజలి.

Anjali Marriage Rumors Again.. పెళ్ళెప్పుడు.?

దాంతో, ‘పెళ్ళెప్పుడు.?’ అన్న ప్రశ్న సహజంగానే అంజలికి ఎదురవుతోంది. ‘ఎవరి కోసమో నేను పెళ్ళి చేసుకోను. పెళ్ళి ఆలోచన వస్తే, అప్పుడు ముందడుగు వేస్తాను.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పింది అంజలి.

ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. హీరోయిన్లు, నలభయ్యేళ్ళకిగానీ పెళ్ళి ఆలోచనలు చేయడంలేదు. అందరూ కాదు లెండి.. కొంతమంది.!

ఇంకొంతమంది వయసులో వుండగానే పెళ్ళి చేసేసుకుని, సినిమా కెరీర్‌ని ఎంచక్కా కొనసాగిస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది.

సినీ నటులు కనిపిస్తే, పెళ్ళి ముచ్చట్లనేవి సర్వసాధారణం. వేదికల మీద యాంకర్లే అడిగేస్తున్నారు, పెళ్ళెప్పుడని.! అడిగించుకుంటున్నారు కూడా కొందరు సెలబ్రిటీలు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group