Rachita Ram Fan Selfie Shock.. హీరోయిన్లు కనిపిస్తే, ఆకతాయి కుర్రాళ్ళు అస్సలు ఆగలేకపోతున్నారు. కొందరైతే, అత్యంత అసభ్యకరమైన రీతిలో ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్ళ క్రితం ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి వెళ్ళిన నిధి అగర్వాల్ విషయంలో అల్లరి మూకలు చేసిన అకృత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
దాంతో, హీరోయిన్ల వస్త్ర ధారణపై పెద్ద డిబేట్ జరిగింది. ఈ ఘటనపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
గ్లామరస్‌గా నిధి అగర్వాల్ డ్రెస్సింగ్ చేసుకోవడం వల్లే, ఆకతాయిలు అదుపు తప్పారన్నది నటుడు శివాజీ వెర్షన్. పలువురు నటీమణులు, శివాజీ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు.
విషయం ముదిరి పాకాన పడ్డంతో, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది శివాజీకి.
కానీ, పద్ధతిగా చీరకట్టుకుని వెళ్ళిన కన్నడ హీరోయిన్ రచిత రామ్ విషయంలో అభిమాని ఎందుకు ఓవరాక్షన్ చేసినట్లు.? ఇంతకీ, ఆ అభిమాని చేసిన ఆ ‘చెత్త’ పనేంటి.?
Rachita Ram Fan Selfie Shock.. డింపుల్ క్వీన్ బుగ్గలు నిమిరేశాడు..
అవకాశం దొరికింది.. చక్కగా సెల్ఫీ తీసుకున్నాడు.! అక్కడితో ఆగలేదు, ఇంకో అడుగు ముందుకేసి, డింపుల్ క్వీన్ రచితా రామ్‌ని టచ్ చేశాడు.. అదీ బుగ్గల మీదనే.
క్యూట్‌గా అలా బుగ్గలు నిమిరేశాడా అభిమాని. నాన్సెన్స్, అది క్యూట్ ఏంటి.? అంటూ నెటిజనం మండిపడుతున్నారు.
ఇలా చేస్తే ఎలా.? క్యూట్ మూమెంట్.. అని కొందరు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.
అదే సమయంలో, ‘పబ్లిక్ మేనర్స్’ లేకుండా బిహేవ్ చేశాడన్నది మెజార్టీ అభిప్రాయం. ఊహించని ఈ ఘటనతో రచితా రామ్ తొలుత షాక్ అయ్యింది. అంతలోనే తేరుకుంది.
సినీ తారలంటే, ఒకప్పుడు.. ఎవరికీ అందనంత ఎత్తులో వుండేవారు. ఇప్పుడలా కాదు.! సినిమా ఫంక్షన్లలో అయినా, ఇతరత్రా కార్యక్రమాల్లో అయినా, అభిమానులకు చాలా దగ్గరగా వస్తున్నారు.
దుర్వినియోగమవుతోంది..
ఈ అవకాశాన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటోంటే, కొందరు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. బుగ్గలు నిమిరడమే తప్పు.. అలాంటిది, అసభ్యకరంగా ప్రైవేట్ పార్ట్స్‌ని తాకి వుంటే.?
ఇలాంటి సందర్భాల్లో భద్రతా సిబ్బంది కావొచ్చు, నిర్వాహకులు కావొచ్చు.. వాళ్ళు సైతం ఏమీ చేయలేని పరిస్థితి.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఆ మాటకొస్తే, మలయాళ సినీ పరిశ్రమలోనూ.. ఇతర అన్ని సినీ పరిశ్రమల్లోనూ సెలబ్రిటీలకు ఇలాంటి షాక్‌లు సర్వసాధారణమైపోయాయి.
భద్రత పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి ‘వరస్ట్ మూమెంట్స్’ జరుగుతూనే వున్నాయి.
ఓ సంఘటన జరిగాక ‘క్యూట్’ అనే చర్చ జరగినా.? ‘దారుణం’ అనే చర్చ జరిగినా.. ఆ ఇన్సిడెంట్ వైరల్ అవుతోంది. దాంతో, మరింతమంది ఈ తరహా వెకిలి వేషాలు వేస్తూనే వున్నారు.
ఈ మధ్య హీరోయిన్లకే కాదు, హీరోలకీ ఇలాంటి అనుకోని షాక్‌లు ఎదురవుతున్నాయి అభిమానుల నుంచి. సెల్ఫీల ముసుగులో ఆకతాయిల చిల్లర వేషాలు మితిమీరుతున్నాయి.
