Home » నీఛత్వం నాది కాదు: జగన్‌పై షర్మిల ఫైర్.!

నీఛత్వం నాది కాదు: జగన్‌పై షర్మిల ఫైర్.!

by Mudra369 Editorial Desk
0 comments
Jagan Sharmila

Yelahanka Twist Jagan Sharmila.. యెలహంక ప్యాలెస్ పంపకాల్లో కొత్త ట్విస్ట్.! సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోదరి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సోషల్ మీడియా వేదికగా.

‘నీఛత్వం నాది కాదు’ అంటూ, సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్‌కి వైఎస్ షర్మిల ఇచ్చిన కౌంటర్ ఎటాక్, రాజకీయ వర్గాల్లో హాట్ టాసిక్‌గా మారింది.

వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం, యెలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, భద్రతా కారణాల రీత్యా, ఆ ప్యాలెస్‌లో పెళ్ళి చేయడం సబబు కాదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సోదరి వైఎస్ షర్మిలకి కొన్నాళ్ళ క్రితమే లేఖ రాశారు.

Yelahanka Twist Jagan Sharmila.. యెలహంక పంచాయితీ..

మరోపక్క, వైఎస్ షర్మిలకి ‘యెలహంక’ ప్యాలెస్‌తో అసలు సంబంధమే లేదంటూ వైసీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న విమర్శల నేపథ్యంలో, వైఎస్ షర్మిల స్పందించక తప్పలేదు.

యెలహంక ప్యాలెస్‌లో తనకు పూర్తి హక్కు వుందంటూ వైఎస్ షర్మిల, తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకూ అది ఉమ్మడి ఆస్థి అని షర్మిల సంచలన ప్రకటన చేయడం గమనార్హం.

గత కొంతకాలంగా వైఎస్ జగన్ – వైఎస్ షర్మిల మధ్యన ఆస్తుల పంపకాల పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో షర్మిలకి బాసటగా నిలుస్తున్నారు విజయమ్మ.

ఉమ్మడి ఆస్థి.. పంపకాల లొల్లి..

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేననీ, ఉమ్మడి ఆస్తుల్ని మనవళ్ళకు, మనవరాళ్ళకు సమానంగా పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించారనీ విజయమ్మ చెబుతున్నారు.

అయితే, తండ్రి ఆస్థిలో కుమార్తెకు వాటా వుండబోదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి కూడా.

గొడవలు ఏమైనా వుండొచ్చుగాక.! కానీ, మేనకోడలు అంజలి రెడ్డి వివాహ వేడుకకి సంబంధించిన వేదిక విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరాలు పెట్టడం ఆక్షేపణీయమే.

పెళ్ళికి పెద్దగా వ్యవహరించాల్సిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన చేతుల మీదుగా తన మేనకోడలి వివాహాన్ని తమ ప్యాలెస్సులో జరిపిస్తే, అది ఆయనకే కదా గౌరవం.?

తగ్గిన షర్మిల.. నెగ్గిన జగన్..

అంజలి రెడ్డి తన తాతయ్యకు సంబంధించిన ప్యాలెస్‌లో పెళ్ళి చేసుకోవాలనుకుందనీ, అది అంజలి రెడ్డికే వారసత్వంగా వచ్చిన ఆస్థి అనీ షర్మిల చెబుతుండం తెలిసిన విషయాలే.

కాగా, వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత తమ మీద వుందంటూ షర్మిల తాజాగా సంచలన ప్రకటన చేశారు.

వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నట్లు షర్మిల వెల్లడించారు.

సో, ఇక్కడితో ఈ వివాహ వేడుక తాలూకు వేదిక విషయమై నెలకొన్న వివాదం ఇప్పటికి సద్దుమణిగినట్లే.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group